హాంగ్‌కాంగ్‌కు వీడ్కోలు: తనకు తానుగా తప్పుకోనున్న టిక్‌టాక్

By Siva KodatiFirst Published Jul 7, 2020, 8:18 PM IST
Highlights

జాతీయ భద్రతా చట్టం అమల్లోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే హాంగ్‌కాంగ్ మార్కెట్‌ను వీడి బయటకు పోవాలని టిక్‌టాక్ డిసైడ్ అయ్యింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. 

గాల్వన్ లోయలో 20 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న చైనాకు గట్టి బుద్ధి చెప్పే చర్యల్లో భాగంగా టిక్‌టాక్ సహా 59 యాప్స్‌ను భారత ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మనదేశం చూపిన దారిలో నడిచేందుకు అనేక దేశాలు సిద్ధమవుతున్నాయి.

అయితే హాంకాంగ్ విషయంలో మాత్రం టిక్‌టాక్ తనంత తానుగా వైదొలిగేందుకు నిర్ణయించింది. జాతీయ భద్రతా చట్టం అమల్లోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే హాంగ్‌కాంగ్ మార్కెట్‌ను వీడి బయటకు పోవాలని టిక్‌టాక్ డిసైడ్ అయ్యింది.

Also Read:చైనాయాప్ టిక్ టాక్ పై మళ్ళీ బ్యాన్.. ఇప్పుడు అమెరికాలో..?

ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఇప్పటికే చాలా టెక్నాలజీ కంపెనీలు హాంగ్‌కాంగ్‌ను వీడి బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. వీటిలో ఫేస్‌బుక్ కూడా ఉంది.

ఆ ప్రాంతంలో ఫేస్‌బుక్ వినియోగదారుల డేటాను ప్రభుత్వానికి ఇచ్చే అంశాన్ని ఫేస్‌బుక్ పక్కనబెట్టింది. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో తాము హాంగ్‌కాంగ్‌లో మా యాప్ కార్యకలాపాలు నిలిపివేయాలని నిర్ణయించామని టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ ప్రతినిధి వెల్లడించారు.

Also Read:టిక్‌టాక్‌పై నిషేధం: 'డబ్ షూట్' యాప్‌ను రూపొందించిన హైద్రాబాద్ సంస్థ

హాంగ్‌కాంగ్ నుంచి టిక్‌టాక్ వైదలగొడం వల్ల కంపెనీకి పెద్ద నష్టం ఉండదు. ఎందుకంటే అక్కడ 1,50,000 వినియోగదారులు మాత్రమే ఉన్నారు. ఈ ఏడాది మొదటి వరకు టిక్‌టాక్‌కు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.

చైనాలో బైట్‌డ్యాన్స్‌కు డోయిన్ అనే యాప్ ఉంది. ఇది కూడా టిక్‌టాక్ వలే పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వినియోగించేందుకు టిక్‌టాక్‌ను తయారు చేసింది. కానీ, డేటా చైనాకు వెళుతున్నట్లు ఆరోపణలు రావడంతో భారత్ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. 

click me!