రోడ్డు ప్రమాదం... గోల్ఫ్ ప్లేయర్ టైగర్ వుడ్స్ కి గాయాలు

Published : Feb 24, 2021, 09:26 AM IST
రోడ్డు ప్రమాదం... గోల్ఫ్ ప్లేయర్ టైగర్ వుడ్స్ కి గాయాలు

సారాంశం

టైగర్ వుడ్స్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొడుతూ రోడ్డు పక్కనున్న లోయలోకి 20 అడుగుల దూరం దూసుకెళ్లి పడ్డట్లు పోలీసులు తెలిపారు. 

అమెరికాకు చెందిన ప్రఖ్యాత గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్(45) రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజిల్స్ కౌంటీలో ఉన్న రాంచో పాలో వర్జిస్ వద్ద మంగళవారం ఉదయం 7 గంటలకు( భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్థరాత్రి దాటాక) రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.

టైగర్ వుడ్స్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొడుతూ రోడ్డు పక్కనున్న లోయలోకి 20 అడుగుల దూరం దూసుకెళ్లి పడ్డట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఆయన కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయని, ఆయన్ను సమీప ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు.  ఆయనకు ప్రస్తుతం శస్త్రచికిత్స చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Iran: మళ్లీ మొదటికొచ్చిన పంచాయతీ.. దేశంలో ధరలు భారీగా పెరగడం తప్పదా
Modi Trump: 16 నెల‌ల త‌ర్వాత తొలిసారి క‌లిసిన మోదీ, ట్రంప్‌.. అంతా సెట్ అయిన‌ట్లేనా.?