జైల్లో అల్లర్లు... 62మంది ఖైదీలు మృతి

Published : Feb 24, 2021, 08:56 AM IST
జైల్లో అల్లర్లు... 62మంది ఖైదీలు మృతి

సారాంశం

జైళ్లలో ఖైదీల హింసాకాండతో ఈక్వెడార్ పోలీసులు మిలటరీని రంగంలోకి దించారు. జైలు అల్లర్లలో పలువురు పోలీసులు కూడా గాయపడ్డారని చెప్పారు.

జైల్లో అల్లర్లు జరిగి దాదాపు 62 మంది ఖైదీలు మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన ఈక్వెడార్ లో చోటుచేసుకుంది. జైలు లోపల జరిగిన పోరులో మరికొందరు ఖైదీలు కూడా గాయపడ్డారు. ఈక్వెడార్ పశ్చిమ ఓడరేవు నగరమైన గుయాక్విల్ జైలులోని ఖైదీ ముఠాల మధ్య జరిగిన పోరాటంలో 62 మంది మరణించారు. దక్షిణ క్యుంకాలోని జైలులో 33 మంది, లాటాకుంగాలో 8 మంది మరణించినట్లు జైళ్ల నిర్వహణ సంస్థ డైరెక్టర్ ఎడ్ముండో మోన్కాయో చెప్పారు. 

తన భర్త అయిన ఖైదీ రికార్డో నుంచి వాట్సాప్ వాయిస్ మెసేజ్ వచ్చిందని, అందులో ‘‘వారు నన్ను చంపబోతున్నారు, నన్ను ఇక్కడి నుంచి బయటకు రప్పించండి’’ అంటూ ఉందని ఖైదీ భార్య చెప్పారు.జైళ్లలో ఏకకాలంలో హింసాకాండ చెలరేగడానికి నేరగాళ్లే కారణమని ఈక్వెడార్ అధ్యక్షుడు లెనిన్ మోరెనో ట్వీట్ చేశారు.

జైళ్లలో ఖైదీల హింసాకాండతో ఈక్వెడార్ పోలీసులు మిలటరీని రంగంలోకి దించారు. జైలు అల్లర్లలో పలువురు పోలీసులు కూడా గాయపడ్డారని చెప్పారు.జైలులో ఖైదీల నుంచి రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నామని జైలు అధికారులు చెప్పారు. 29వేలమంది ఖైదీల సామర్థ్యం గల జైలులో 38వేలమంది ఖైదీలను ఉంచారు. ఇంతమంది ఖైదీలను పర్యవేక్షించడానికి 1500 మంది కాపలాదారులు మాత్రమే ఉన్నారు. దీంతో ఈక్వెడార్ జైళ్లలో పలుసార్లు ఖైదీల తిరుగుబాటు జరుగుతోంది.జైళ్లలో జరిగిన అల్లర్లతో 90 రోజుల పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. గత ఏడాది కూడా జైళ్లలో 51 మంది ఖైదీలు మరణించారని ఈక్వెడార్ పోలీసులు చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే