అప్ఘాన్‌లో ముగ్గురు విదేశీయుల్ని కాల్చిచంపిన తాలిబన్లు, మృతుల్లో ఒకరు ఇండియన్...

First Published Aug 2, 2018, 6:06 PM IST
Highlights

అప్ఘానిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి విదేశీయులపై రెచ్చిపోయారు. అప్ఘాన్ లోని ఓ అంతర్జాతీయ కంపనీలో పనిచేస్తున్న ముగ్గురు విదేశీయుల్ని కిడ్నాప్ చేసిన తాలిబన్లు, అత్యంత దారుణంగా వారిని హతమార్చారు. ఉగ్రవాదుల చేతిలో హతమైన వారిలో ఓ ఇండియన్ కూడా ఉన్నారు. 
 
అప్ఘానిస్థాన్‌లో ఉగ్రవాదులు విదేశీయులనే టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు అనేకం వెలుగుచూశాయి. తాజాగా వలనవాదులపై మరోసారి తాలిబన్లు నిర్దయగా వ్యవహరించారు. 

అప్ఘాన్ లోని పోడెక్సో అనే ఇంటర్నేషనల్ కంపనీలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులను తాలిబన్లు కిడ్నాప్ చేశారు. అనంతరం వారిని కాల్చి, మృతదేహాలను ఓ కారులో పెట్టి ముసాహీ జిల్లాలోని ఓ పార్కింగ్ ప్రాంతంలో నిలిపారు. మృతుల్లో ఇండియాకు చెందిన వ్యక్తితో పాటు మలేషియా, మాసిడోనియా దేశాలకు చెందిన వ్యక్తులు ఉన్నట్లు
అప్ఘాన్ అంతర్గత భద్రత మంత్రిత్వశాఖ అధికారి నుష్రత్‌ రహీమి వెల్లడించారు.

అయితే ఈ ఘటనపై  ఇప్పటికే దర్యాప్తు ప్రారంభమైందని తెలిపిన ఆయన, పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని తెలిపారు. మృతదేహాలను స్వాధీనం  చేసుకున్నామని, అధికారిక వ్యవహారాలను ముగించి వారి స్వదేశాలకు పంపిస్తామని ఆయన తెలిపారు. 

click me!