ప్రపంచంలోకెల్లా ఆనందకరమైన దేశం ఇదే..!

By telugu news teamFirst Published Mar 20, 2021, 8:50 AM IST
Highlights

మొదటి స్థానంలో ఫిన్లాండ్ నిలవగా.. రెండో స్థానంలో డెన్మార్క్ ఆ తర్వాతి స్థానాల్లో స్విట్జర్లాండ్, ఐస్లాండ్, నెదర్లాండ్ వంటి దేశాలు ఉన్నాయి. 

ప్రపంచంలో కెల్లా అత్యంత ఆనందకరమైన దేశం ఏదో మీకు తెలుసా..? ఫిన్లాండ్. ఈ దేశం వరసగా నాలుగో సారి.. ఈ జాబితాలో మొదటి స్థానాన్ని కొట్టేసింది. ప్రపంచం మొత్తం కరోనా దాటికి అతలాకుతలమై.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. కాగా.. కరోనా తర్వాత కూడా ఈ దేశంలో ప్రపచంలోనే అత్యతం ఆనందకరమైన దేశంగా చోటు దక్కించుకుంది. ఈ మేరకు యూఎన్ సంస్థ రిపోర్టు విడుదల చేసింది.

పరిశోధకులు దాదాపు149 దేశాలపై ఈ సర్వే చేశారు. దేశ ప్రజలను అడిగి మరీ ఈ డేటా తయారు చేస్తారు. అన్ని దేశాల్లోని ప్రజలను తాము ఎంత ఆనందంగా ఉన్నామో చెప్పాలని.. దానికి రేటింగ్ ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా. ప్రతి దేశంలోని జీడీపీ, సామాజిక మద్దతు, వ్యక్తిగత స్వేచ్ఛ, అవినీతి స్థాయి లాంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మరీ ఈ నివేదిక విడుదల చేశారు.

మొదటి స్థానంలో ఫిన్లాండ్ నిలవగా.. రెండో స్థానంలో డెన్మార్క్ ఆ తర్వాతి స్థానాల్లో స్విట్జర్లాండ్, ఐస్లాండ్, నెదర్లాండ్ వంటి దేశాలు ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే న్యూజిలాండ్ ఒక స్థానం పడిపోయి తొమ్మిదో ప్లేస్ చేరుకుంది. మొదటి పది దేశాల్లో నాన్ యూరోపియన్ దేశం ఇదొక్కటే కావడం గమనార్హం.

జర్మనీ గతేడాది 17వ స్థానంలో ఉండగా.. ఈ ఏడాది 13వ స్థానానికి చేరుకుంది. ఫ్రాన్స్ 21వ స్థానం దక్కించుకుంది. ఇక యూకే 13వ స్థానం నుంచి 17వ స్థానానికి పడిపోయింది. అమెరికా కూడా 19వ స్థానాన్ని సరిపెట్టుకుంది.

ఆఫ్రికన్ దేశాలు లెసోతో, బోట్స్వానా, రువాండా , జింబాబ్వే చివరి స్థానాల్లో ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం ప్రపంచంలో అత్యంత అసంతృప్తికరమైన దేశంగా ఆప్ఘనిస్తాన్ మిగిలిపోయింది.

ఈ డేటా విడుదల చేసే క్రమంలో మహమ్మారి యొక్క ప్రభావాన్ని అంచనా వేయడానికి రచయితలు ఈ సంవత్సరం డేటాను మునుపటి సంవత్సరాల సగటుతో పోల్చారు.

click me!