చిన్నారికి పుట్టుకుతోనే కరోనా యాంటీ బాడీస్

By telugu news teamFirst Published Mar 18, 2021, 12:12 PM IST
Highlights

పాప పుట్టాక బొడ్డు తాడు నుంచి తీసిన రక్తంతో జరిపిన పరీక్షల ఆధారంగా ఈ విషయం బయటపడింది. 


కోవిడ్-19కు గురై కోలుకున్న వారిలో, వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో యాంటీ బాడీస్ వృద్ధి చెందుతాయి. అయితే అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఓ చిన్నారి కరోనా యాంటీ బాడీస్‌తోనే జన్మించడం విశేషం. పాప పుట్టాక బొడ్డు తాడు నుంచి తీసిన రక్తంతో జరిపిన పరీక్షల ఆధారంగా ఈ విషయం బయటపడింది. పుట్టుకతోనే ఆ చిన్నారికి యాంటీ బాడీస్ రావడానికి కారణం ఆమె తల్లి గర్భంతో ఉన్నప్పుడు వ్యాక్సిన్ వేయించుకోవడమే.

చిన్నారి కడుపులో ఉన్నప్పుడే ఆమె తల్లి కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకుందని, దానివల్ల చిన్నారిలోనూ యాంటీ బాడీస్‌ వృద్ధి చెందాయని వైద్యులు పాల్‌ గిల్బర్ట్, చాడ్‌ రుడ్నిక్ స్పష్టం చేశారు. ప్రపంచలోనే తొలిసారిగా కరోనా యాంటీ బాడీస్‌తో జన్మించిన చిన్నారి ఈమేనని అధికారికంగా ధ్రువీకరించారు. అయితే ఆ చిన్నారి శరీరంలో ఆ యాంటీ బాడీస్ ఎంత కాలం ఉంటాయి, ఎంతవరకు రక్షణ ఉంటుందనేది పరీక్షించాలని తెలిపారు. 
 

click me!