ఇండోనేషియాలో మూడో సారి భూకంపం: వణికిపోతున్న ప్రజలు

First Published Aug 9, 2018, 2:55 PM IST
Highlights

ఇండోనేషియాలో మూడోసారి భారీ భూకంపం వణికించింది. వరుసగా ఇండోనేషియాలో  భూకంపాలు సంభవిస్తున్నాయి. గురువారం నాడు సంభవించిన భూకంపం మూడోది. వరుస భూకంపాలతో  జనజీవనం అస్తవ్యస్తమైంది.


బాలీ: ఇండోనేషియాలో మూడోసారి భారీ భూకంపం వణికించింది. వరుసగా ఇండోనేషియాలో  భూకంపాలు సంభవిస్తున్నాయి. గురువారం నాడు సంభవించిన భూకంపం మూడోది. వరుస భూకంపాలతో  జనజీవనం అస్తవ్యస్తమైంది.

 నాలుగు రోజుల క్రితం ఇండోనేషియాలోని లాంబోక్‌ ద్వీపంలో వచ్చిన భారీ భూకంపం ఇండోనేషియాను అతలాకుతలం చేసింది. ఇంకా ఆ ప్రభావం నుంచి తేరుకోకముందే గురువారం నాడు ఉదయం లాంబోక్‌లో మళ్లీ భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై 5.9 తీవ్రత నమోదైంది. ఆదివారం సంభవించిన భూకంపం  కారణంగా సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.

ఈ తరుణంలో వరుసగా భూకంపాలు రావడం ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కల్గిస్తున్నాయి.  ఆదివారం లాంబోక్‌ ద్వీపంలో 6.9 తీవ్రతతో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ భూకంపం కారణంగా ఇప్పటికే 164 మంది మృత్యువాత పడ్డారు. 1400మందికి గాయాలయ్యాయి.

భూకంపం కారణంగా ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని  అధికారులు చెబుతున్నారు. భూకంపం కారణంగా నష్టానికి సంబంధించిన అంచనాలను  తయారు చేస్తున్నారు అధికారులు.వరుస భూకంపాల కారణంగా ఇండోనేషియా వాసులు తీవ్రంగా నష్టపోతున్నారు.

click me!