ఆఫ్ఘనిస్తాన్ లో ఆటవిక న్యాయం : దొంగతనంచేశారని.. బహిరంగంగా నలుగురి చేతులు నరికివేసిన తాలిబన్లు..

By SumaBala BukkaFirst Published Jan 18, 2023, 9:31 AM IST
Highlights

కాందహార్‌లోని అహ్మద్ షాహి స్టేడియంలో మంగళవారం నాడు దోపిడీ, 'సొడొమి' ఆరోపణలపై తొమ్మిది మందిని శిక్షించారని ఆఫ్ఘనిస్తాన్ మీడియా తెలిపింది.

కాందహార్ : ఆఫ్ఘనిస్తాన్ లో ఆటవిక న్యాయం భయాందోళనలు కలిగిస్తోంది. కాందహార్‌లోని అహ్మద్ షాహీ స్టేడియంలో దోపిడి, "సోడమీ"కి పాల్పడిన తొమ్మిది మందికి తాలిబాన్లు మంగళవారం బహిరంగంగా కొరడా దెబ్బలు తినిపించారు. "కాందహార్‌లోని అహ్మద్ షాహి స్టేడియంలో మంగళవారం నాడు దోపిడి, 'సొడొమి' ఆరోపణలపై తొమ్మిది మందిని శిక్షించారని సుప్రీంకోర్టు ఒక ప్రకటనలో తెలిపింది" అని టోలో న్యూస్ ట్వీట్ చేసింది. కొరడా దెబ్బల సమయంలో స్థానిక అధికారులు, కాందహార్ లోని స్థానికులు హాజరయ్యారు. దోషులను 35-39 కొరడా దెబ్బలు కొట్టారని ప్రావిన్షియల్ గవర్నర్ ప్రతినిధి హాజీ జైద్ తెలిపారు.

ఇదిలా ఉండగా, కాందహార్‌లోని ఫుట్‌బాల్ స్టేడియంలో తాలిబాన్లు నలుగురి చేతులు నరికివేసినట్లు మరో సమాచారం అని ఆఫ్ఘన్ పునరావాస మంత్రి, యూకేలోని శరణార్థుల మంత్రికి మాజీ విధాన సలహాదారు షబ్నమ్ నసిమి తెలిపారు. "కాందహార్‌లోని ఫుట్‌బాల్ స్టేడియంలో ఈరోజు తాలిబాన్‌లు నలుగురు వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ప్రేక్షకుల సమక్షంలోనే వారి చేతులను నరికివేశారని తెలిసింది. ఆఫ్ఘనిస్తాన్‌లో న్యాయమైన విచారణ, సరైన ప్రక్రియ లేకుండా ప్రజలను కొరడా దెబ్బలు కొట్టి, నరికివేసి, ఉరితీస్తున్నారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన' అని ఆమె ట్వీట్ చేశారు.

ఉగ్రస్థావరంగా పాకిస్థాన్ .. ఇప్పటివరకు 150 మంది ఉగ్రవాదులు, ఉగ్ర గ్రూపులను బ్లాక్‌లిస్ట్‌ చేసిన ఐక్యరాజ్యసమితి

అంతర్జాతీయంగా పలు దేశాలు ఖండించినప్పటికీ తాలిబాన్ లు ఈ కఠిన శిక్షలను అమలు చేస్తూనే ఉన్నారు. కరడుగట్టినవారి అత్యున్నత నాయకుడి డిక్రీని అనుసరించి నేరస్థులపై కొరడాలు ఝులిపించడం, బహిరంగంగా ఉరితీయడాన్ని పునఃప్రారంభించారు. ఈ బహిరంగ ఉరితీత గురించి యూఎన్ నిపుణులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో కొరడా దెబ్బలు మళ్లీ ప్రారంభమయ్యాయని.. అన్ని రకాల తీవ్రమైన, క్రూరమైన, అవమానకరమైన శిక్షలను వెంటనే నిలిపివేయాలని అధికారులను కోరుతున్నారు.

వారు ఒక ప్రకటనలో ఇలా అన్నారు, "నవంబర్ 18, 2022 నుండి, తఖర్, లోగర్, లఘ్‌మాన్, పర్వాన్, కాబూల్‌తో సహా అనేక ప్రావిన్సులలో 100 మంది వ్యక్తులు, స్త్రీలు, పురుషులకు ఫాక్టో అధికారులు కొరడా దెబ్బలు శిక్ష వేశారని నివేదించబడింది. దొంగతనం, 'చట్టవిరుద్ధమైన' సంబంధాలు లేదా సామాజిక ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడం వంటి ఆరోపణ నేరాలకు 20 నుంచి 100 కొరడా దెబ్బలు. వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణించడం..  జెండర్ విషయంలో తేడాలు లేనట్టుగా కనిపిస్తున్నప్పటికీ, ఆచరణలో మాత్రం, మహిళలు, బాలికలకు వ్యతిరేకంగా శిక్షలు ఎక్కువగా ఉన్నాయి. కొరడా దెబ్బలు ఎక్కువగానే విధిస్తున్నారు.  ఈ శిక్షలను కూడా అధికారులు, ప్రజల సమక్షంలో స్టేడియంలలో విధిస్తున్నారు."

డిసెంబర్ 7, 2022న, ఫరా ప్రావిన్స్‌లోని ఫరా నగరంలో తాలిబాన్ ఒక వ్యక్తిని బహిరంగంగా ఉరితీసింది, ఆగస్ట్ 2021లో అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత మొదటిసారి బహిరంగంగా ఉరితీయడం జరిగింది. దీనికి "ఉప ప్రధాన మంత్రి, ప్రధాన న్యాయమూర్తితో సహా సీనియర్ ఫాక్టో అధికారులు హాజరయ్యారు. నవంబర్ 13, 2022 న సుప్రీం లీడర్ హుదూద్ (దేవునిపై నేరాలు) ఖిసాస్ (ప్రతీకారం) అమలు చేయాలని న్యాయవ్యవస్థను ఆదేశించిన తర్వాత దేశవ్యాప్తం ఈ రకమైన శిక్షలు ప్రారంభమయ్యాయి" అని ప్రకటనలో తెలిపారు.

మరణశిక్షపై తక్షణమే మారటోరియం ఏర్పాటు చేయాలని, కొరడాలతో కొట్టడం, హింసను లేదా ఇతర క్రూరమైన, అమానవీయమైన లేదా కించపరిచే చికిత్స లేదా శిక్షను విధించే ఇతర శారీరక శిక్షలను నిషేధించాలని... అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా న్యాయమైన విచారణ, తగిన ప్రక్రియకు హామీ ఇవ్వాలని ఫాక్టో అధికారులను కోరింది.

click me!