టార్జాన్, మోగ్లీలాంటిదే ఈ డాగ్ ఉమెన్ కథ.. కుక్కలే పెంచాయి, కుక్కలా తయారయ్యింది..

By SumaBala Bukka  |  First Published Feb 21, 2024, 4:08 PM IST

ఇప్పుడు 40 ఏళ్ల వయస్సులో ఉన్న ఆక్సానా మలయా, మొరగడం, ఊలలు పెట్టడం, నాలుగు కాళ్లపై నడవడం లాంటి జంతువుల లక్షణాలను అలవరచుకుంది.


ఉక్రెయిన్ : టార్జాన్, మోగ్లీల కథ వినుంటారు. చదువుతుంటే.. వాటి స్టోరీలు టీవీల్లో చూస్తుంటూ ఎంతో ఆసక్తిగా అనిపిస్తాయి. జంతువుల మధ్య, జంతువులు ఓ మనిషిని పెంచే కథలవి. ఇవి నిజంగా జరిగాయా అనడానికి ఆధారాలు లేవు. కానీ, అలాంటి స్టోరీనే ఇప్పుడు ఉక్రెయిన్ లో ఒకటి వెలుగు చూసింది. ఓ మహిళను కుక్కలు పెంచాయి. ఇప్పుడు 40యేళ్ల వయసులో ఉన్న ఆ మహిళ కుక్కలాగే మొరుగుతుంది. కుక్కలా అరుస్తుంది. నాలుగు కాళ్లమీదే నడుస్తుంది. ఆహారాన్ని కూడా నాలుకతోనే తింటుంది.

వింటుంటే విచిత్రంగా అనిపిస్తుంది కదా.. అయినా, ఇది నిజం.. వివరాల్లోకి వెడితే... ఉక్రెయిన్‌కు చెందిన ఆక్సానా మలయా అనే మహిళ తన బాల్యంలో కుక్కలతోనే పెరిగింది. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, మలయా 3 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు.. మద్యపానానికి అలవాటు పడిన ఆమె తల్లిదండ్రులు ఆమెను చలిలో ఇంటి బయట విడిచిపెట్టారు. అప్పుడే ఆమె జీవితం అసాధారణమైన మలుపు తిరిగింది. 

Latest Videos

undefined

పెంచిన సింహం దాడిలో మృతి చెందిన జూ కీపర్.. ఆహారం పెడుతుండగా అటాక్...

చిన్నారి చలిలో వెచ్చదనం కోసం, ఆశ్రయం కోసం తమ పెంపుడు కుక్కలుంటే చోటుకు చేరుకుంది. వాటితో పాటే, వాటి మధ్యలో పడుకుంది. అలా ఐదేళ్లపాటు వాటితోనే ఉంది. దీంతో ఆమె పూర్తిగా కుక్కలాగే నాలుగు కాళ్లమీద నడవడం, మొరగడం.. వాటితో అలాగే కమ్యూనికేట్ చేయడం నేర్చకుంది. అలా జంతు లక్షణాలు వచ్చాయామెకు. 

ఇది చాలా ఆలస్యంగా గమనించిన ఇరుగుపొరుగు వారు ఆమె పరిస్థితి గురించి ఉక్రేనియన్ అధికారులు అప్రమత్తం చేశారు. దీంతో మలయాను చివరకు 9 సంవత్సరాల వయస్సులో రక్షించారు. ఆ సమయంలో పోలీసుల నుంచి ఆమెను రక్షించేందుకు కుక్కలు తీవ్రంగా పోరాడినట్లు పోలీసులు తెలిపారు. అధికారులు కుక్కలకు ఆహారం పెట్టి వాటి దృష్టి మరల్చిన తరువాత వారు బాలికను కుక్కల బోనులో నుంచి బైటికి తీసుకురాగలిగారు. 

ఆ తరువాత ఆమెను ఫోస్టర్ హోమ్‌కి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు ఎలా నడవాలో, ఎలా మాట్లడాలో నేర్పించారు. అయినా, ఆమె ఇప్పటికీ తన కుక్కల ప్రవర్తన పూర్తిగా కోల్పోలేదు. ఇప్పుడామె వయసు 40 యేళ్లు కానీ, నిపుణులు ఆమెకు 6 సంవత్సరాల వయస్సు పిల్లల మనస్తత్వమే ఉందని నిర్ధారించారు.

"ఆమె ఇక ఎప్పటికీ చదవగలదని లేదా ఉపయోగకరంగా ఉండగల ఏదైనా చేయగలదని నేను అనుకోను" అని పిల్లల మనస్తత్వవేత్త లిన్ ఫ్రై అన్నారు. దీనిమీద ఆమె మాట్లాడుతూ.. మామూలుగా.. 5 యేళ్ల లోపు మీకు భాష రాకపోతే...ఇక మీకు భాష, మాట్లాడే సామర్థ్యం రాదు’ అని వివరించారు.  

మలయా కుక్కలతో జీవించే సమయంలో పచ్చి మాంసాన్ని తినేది, డస్ట్ బిన్ లలో ఆహారం కోసం వెతికేది, ఎక్కడ పడితే అక్కడే మలమూత్ర విసర్జనలు చేసేది. ఆమె తనకు చికిత్స తరువాత మలయా మాట్లాడుతూ, "అమ్మకు చాలా మంది పిల్లలు ఉన్నారు. మాకు సరిపడా పడకలు లేవు. అందుకే నేను కుక్కల దగ్గర చేరాను. వాటితో జీవించడం ప్రారంభించాను" అని తెలిపింది. 

3నుంచి 9యేళ్ల వరకు ఆమె నాలుగు కాళ్లతోనే నడిచేది. మొరిగేది.  మాల్యా ప్రస్తుతం నివసిస్తున్న ప్రత్యేక సంరక్షణ సంస్థ డైరెక్టర్ అన్నా చలయ మాట్లాడుతూ, "ఆమె మనిషి బిడ్డ కంటే ఎక్కువగా చిన్న కుక్కలా ఉంది. ఆమె నీళ్లు చూసినప్పుడు తన నాలుకను చూపించేది. ఆమె తన చేతులతో కాకుండా నాలుకతో తినేది" అని తెలిపారు.

ప్రపంచంలోని అతి క్రూరమైన 100 కేసుల్లో ఇదీ ఒకటి. 2000సం.లో ఆమె తన తల్లిదండ్రులతో కలిసిపోయింది. కానీ, ఆమెలో ఇంకా కొన్ని జంతు లక్షణాలు అలాగే ఉన్నాయి. 

click me!