
ఓ విమానం గాలిలో ఉండగానే దాని ఎమర్జెన్సీ డోర్ తెరుచుకుంది. దీంతో అందులో ఉన్న ప్రయాణికులంతా ఒక్క సారిగా ఏం జరుగుతుందో తెలియక భయబ్రాంతులకు గురయ్యారు. ఎవరి సీట్లో వారే భయం గుప్పిట్లో కూర్చుండిపోయారు. బ్రెజిల్ లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ విమానంలో బ్రెజిల్ గాయకుడు, పాటల రచయిత టియెర్రీ తన సహచరులతో కలిసి ప్రయాణించారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. ఈ వీడియోను బ్రేకింగ్ ఏవియేషన్ న్యూస్ అండ్ వీడియోస్ అనే ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు. బ్రెజిల్ గాయకుడు, గేయ రచయిత టియెర్రీ ప్రయాణిస్తున్న విమానం కార్గో డోర్ తెరుచుకున్నప్పటికీ.. అది సావో లూయిస్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది.
ఎన్ హెచ్ ఆర్ టాక్సీ ఏరియో నిర్వహిస్తున్న ఎంబ్రేయర్ -110 విమానం మారన్ హావోలోని సావో లూయిస్ లో ప్రదర్శన అనంతరం టియెర్రీ, అతని బ్యాండ్ సభ్యులను తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని వారు ట్వీట్ చేశారు. బ్యాండ్ సభ్యులు సురక్షితంగా ఉన్నారని, హోటల్ కు తిరిగి వచ్చారని ‘ఎక్స్ ప్రెస్’ తెలిపింది. ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఇలా చేస్తే దేశంలో ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తాయి - బీజేపీకి తమిళనాడు సీఎం స్టాలిన్ వార్నింగ్
ఈ వీడియోను జూన్ 14న పోస్ట్ చేశారు. అప్పటి నుంచి ఈ వీడియోకు వీపరీతంగా వ్యూవ్స్ వస్తున్నాయి. నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ‘ఇది చాలా సరదాగా ఉంది’ అని ఒకరు కామెంట్ చేయగా.. మరొకరు.. ‘‘కెమెరామెన్ తో సహా అందరూ చాలా ప్రశాంతంగా ఉండటం నాకు షాక్ కలిగించింది’’ అని మరొకరు పేర్కొన్నారు. ఇంకొకరు ‘‘ఇది చాలా భయంకరంగా ఉంది’’ అని కామెంట్ చేశారు.