సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్, మెసేజింగ్ యాప్స్ వాట్సాప్ (WhatsApp),ఫేస్‌బుక్( facebook), ఇన్‌స్టాగ్రామ్ (instagram)సేవలకు శుక్రవారం (జూన్ 16) తీవ్ర అంతరాయం ఏర్పడింది. మూడు సోషల్ మీడియా సైట్‌లతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని మధ్యాహ్నం 3 గంటలకు ET/8pm BSTకి నివేదికలు వచ్చాయి. ఈ అంతరాయం తరువాత ప్రపంచవ్యాప్తంగా మారింది.
పాపులర్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్, మెసేజింగ్ యాప్స్ వాట్సాప్ (WhatsApp),ఫేస్‌బుక్( facebook), ఇన్‌స్టాగ్రామ్ (instagram)సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం (జూన్ 16) సుమారు మధ్యాహ్నం 3 గంటలకు ET/8pm BSTగంటలకి ఈ సమస్య మొదలైంది. లక్షలాది మంది యూజర్లు ఈ విషయంపై ఫిర్యాదులు చేశారు. చాలా సేపు వాట్సాప్‌లో మెసేజ్‌లు సెండ్ అవలేదు, రిసీవ్ కాలేదు. ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు మెసేజ్‌లు పంపడానికి ఇబ్బంది పడుతున్నామని , వాట్సాప్‌లో ఉన్నవారు ఫోటోలు లోడ్ చేయడం లేదని ఫిర్యాదు చేశారు.
అలాగే వెబ్‌సైట్ లోగోలను మాత్రమే చూపుతోందని , పూర్తిగా లోడ్ కావడం లేదని ఫేస్‌బుక్ వినియోగదారులు తెలిపారు . మెటా ప్రతినిధి ది సన్‌తో ఇలా అన్నారు: "కొంతమంది వ్యక్తులు మా ఉత్పత్తులను యాక్సెస్ చేయడంలో సమస్య ఎదుర్కొంటున్నారని మాకు తెలుసు. వీలైనంత త్వరగా విషయాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి మేము కృషి చేస్తున్నాము. ఏదైనా అసౌకర్యానికి మేము క్షమాపణలు కోరుతున్నాము." అని పేర్కొన్నారు.