ఇరాక్‌లో 5,000 ఏళ్ల క్రితమే పబ్, అందులో ఫ్రిడ్జ్, బీర్‌లు, మాంసం ఆనవాళ్లు కనుగొన్న ఆర్కియాలజిస్టులు

Published : Feb 16, 2023, 04:42 PM IST
ఇరాక్‌లో 5,000 ఏళ్ల క్రితమే పబ్, అందులో ఫ్రిడ్జ్, బీర్‌లు, మాంసం ఆనవాళ్లు కనుగొన్న ఆర్కియాలజిస్టులు

సారాంశం

ఇరాక్‌లో సుమారు 5,000 ఏళ్ల క్రితమే పబ్ వంటిది ఉన్నదని, అందులోనూ ఫ్రిడ్జ్, ఓవెన్‌లను వారు వినియోగించారని తాజాగా పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంతేకాదు, ఆ పబ్‌లో ఫిష్, ఇతర జంతువుల ఎముకలను కొన్ని పాత్రల్లో గుర్తించారు. బీర్‌ అవశేషాలనూ కనిపెట్టారు.  

న్యూఢిల్లీ: దక్షిణ ఇరాక్‌లో 5000 ఏళ్ల క్రితమే మనం ఊహించని రీతిలో ప్రజలు జీవించారని తెలుస్తున్నది. సుమేరియా నాగరికతకు సంబంధించి తాజాగా ఆర్కియాలజిస్టులు కనుగొన్న విషయాలు ఆసక్తికరంగానే కాదు.. ఆశ్చర్యానికీ గురి చేస్తున్నాయి. ఇరాక్‌లో లగాష్ నగరానికి చారిత్రక ప్రాముఖ్యత ఉన్నది. ఈ నగరంలో పురాతత్వ శాస్త్రవేత్తలు తాజాగా చేసిన పరిశీలనల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ సుమారు 5000 ఏళ్ల క్రితమే పబ్ నిర్వహించారని, అక్కడికి కొందరు తరుచూ వచ్చి ఆహారం, బీర్లు తాగి వెళ్లేవారని ఊహిస్తున్నారు.

సుమేరియన్ నాగరికతలో లగాష్ కీలకమైన పట్టణం. ఇక్కడ పెన్సిల్వేనియా యూనివర్సిటీ, పీసా యూనివర్సిటీల బృందాలు సంయుక్తంగా చేపట్టిన అధ్యయనంపై పై విషయాలు తెలియవచ్చాయి. లగాష్ పురాతన శిథిలాల కింద ఓ పబ్ ఉన్నట్టు గుర్తించారు. అంతేకాదు, ఆ పబ్‌లో ఓ ఓవెన్, కొన్ని బెంచీలనూ వారు కనుగొన్నారు. జీర్ అని పిలుచుకునే ఇసుకతో చేసిన ఫ్రిడ్జ్‌ని అధ్యయనకారులు గుర్తించారు. ఆ ఫ్రిడ్జ్‌లోని కొన్ని పాత్రల్లో కొంత ఆహారాన్ని వదిలిపెట్టిన ఆనవాళ్లను వారు కనుగొనడం ఆశ్చర్యకరం. చేప, ఇతర కొన్ని జంతువుల ఎముకల అవశేషాలను వారు ఆ పాత్రల్లో కనుగొన్నారు. బీర్ తాగిన ఆధారాలనూ వారు కనిపెట్టారు. సుమేరియన్లు బీర్ ఎక్కువగా సేవించేవారని చరిత్ర చెబుతున్నది. డ్రోన్ ఫొటోగ్రఫీ, థర్మల్ ఇమేజింగ్, మ్యాగ్నెటోమెట్రీ, మైక్రో స్ట్రాటిగ్రఫిక్ శాంప్లింగ్ వంటి అధునాతన సాంకేతిక పరికరాలతో ఈ విషయాలను ఆ బృందాలు ఆవిష్కరించాయి.

Also Read: KGF 2: కేజీఎఫ్‌లో ఎంత బంగారం వెలికి తీశారో తెలుసా...అసలు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఎందుకు మూసేశారు...

తాజా అధ్యయనంలో వారు కనుగొన్న ఐటమ్‌లు సుమేరియా నాగరికతలో పట్టణ ప్రాంతాల్లో సుమారు 4,700 ఏళ్ల క్రితం జీవించిన సాధారణ ప్రజల జీవితాలను పరిశీలించడానికి అద్బుతంగా ఉపకరిస్తాయి. దీని గురించి ప్రాజెక్ట్ డైరెక్టర్ హోలీ పిట్‌మన్ ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీతో ఇలా చెప్పారు. ‘ఈ ఆధారాల నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చంటే.. కొందరు (రెగ్యులర్‌గా వెళ్లేవారు) వారికి ఇంటి వద్ద లభించే ఆహారం కాకుండా బయట తినడానికి వచ్చేవారు. దీన్ని మనం టావెర్న్ అని పిలవచ్చు. ఎందుకంటే ఇక్కడ బీర్ అనేది చాలా కామన్ డ్రింక్‌గా ఉన్నది. నీటి కంటే ఎక్కువగా సుమేరియన్లు బీర్‌నే సేవించేవారు. అక్కడ ఓ క్యూనిఫామ్ ట్యాబ్లెట్ రూపంలో బీర్ రెసీపీ లభించింది’ అని వివరించారు.

PREV
click me!

Recommended Stories

Longest Expressway Tunnel : ప్రపంచంలోనే లాంగెస్ట్ టన్నెల్ ఎక్కడో తెలుసా?
Viral News: ఉద్యోగుల ఖాతాల్లోకి కోట్ల రూపాయలు డిపాజిట్.. నువ్వు బాస్ కాదు సామీ దేవుడివి