
లండన్: ఏడాది పాటు ఓ యువకుడు కోమాలోనే ఉన్నాడు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా గురించి ఆ యువకుడికి తెలియదు. కానీ రెండు దఫాలు ఆయన కరోనా బారినపడ్డాడు.
బ్రిటన్ కు చెందిన యువకుడు జోసెఫ్ ఫ్లావిల్ గత ఏడాది మార్చి 1వ తేదీన బర్టన్ ఆన్ ట్రెంట్ లో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. కారు ఢీకొట్టడంతో ఆయన మెదడుకు తీవ్ర గాయాలయ్యాయి.ఈ ప్రమాదం జరిగిన నాటి నుండి జోసెఫ్ కోమాలోకి వెళ్లిపోయాడు. అదే సమయంలో దేశంలో కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందింది.
దీంతో బ్రిటన్ ప్రభుత్వం దేశంలో లాక్ డౌన్ విధించింది. జోసెఫ్ ఆసుపత్రికే పరిమితమయ్యాడు. అతని కుటుంబసభ్యులను కూడ ఆసుపత్రిలోకి ప్రవేశించేందుకు అధికారులు అనుమతించలేదు.ఏడాదిగా ఆయన ఆసుపత్రిలోనే చికిత్స పొందాడు. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకొంటున్నాడు. ఏడాది కాలంలో ఆయన రెండు దఫాలు కరోనా బారిన పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే ఆయన ఈ వైరస్ బారినపడ్డారు.
ఇప్పుడిప్పుడే జోసెఫ్ కోమా నుండి కోలుకొంటున్నారు. ఇది తమకు ఎంతో ఆనందం కల్గిస్తోందని కుటుంబసభ్యులు చెప్పారు.జోసెఫ్ సాధారణ స్థితికి చేరుకోవడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.