గ్యాస్ సిలిండ్ పేలుడు.. నలుగురి మృతి

Published : Feb 08, 2021, 09:06 AM ISTUpdated : Feb 08, 2021, 09:11 AM IST
గ్యాస్ సిలిండ్ పేలుడు.. నలుగురి మృతి

సారాంశం

గ్యాస్ సిలిండర్ల పేలుడు ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 


బ్రెజిల్ దేశంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు దుర్మరణం చెందారు. బ్రెజిల్ దేశంలోని రియో గ్రాండీ డో నోర్టీ పరిధిలోని నాటల్ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్లు పేలి పోవడంతో.. ఏడు ఇళ్లు ధ్వంసమయ్యాయి. గ్యాస్ సిలిండర్ల పేలుడు ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 49 ఏళ్ల వయసున్న మహిళ, 18 ఏళ్ల యువతి, మరో ఇద్దరు వృద్ధులు తీవ్రంగా గాయపడటంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బ్రెజిల్ మిలటరీ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి సహాయ చర్యలు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !