దేశాధ్యక్షుడి జీతం కన్నా.. ఆ ఉద్యోగికే ఎక్కువ..!

By telugu news teamFirst Published Feb 8, 2021, 1:59 PM IST
Highlights

అగ్రరాజ్యంలో కొవిడ్ కరాళ నృత్యం చేస్తున్న వేళ.. ఇతని మాటలే అమెరికన్లకు వేదం అయ్యాయి. ఫౌచీ చేసిన సూచనలను ప్రజలు తూచా తప్పకుండా పాటించారు.

అమెరికా అధ్యక్ష పదవిని ప్రపంచంలోనే అత్య శక్తివంతమైన పదవిగా అందరూ భావిస్తారు. అమెరికా అధ్యక్షుడు.. ఇతర దేశాల స్థితిని కూడా మార్చేయగలడు. అలాంటి అధ్యక్షుడికి జీతం కూడా అదే స్థాయిలో ఉంటుందని మనమంతా అనుకుంటాం. కానీ.. ఓ ప్రభుత్వ ఉద్యోగికి  అమెరికా దేశాధ్యక్షుడి కన్నా ఎక్కువ జీతం రావడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే... అమెరికా ప్రముఖ అంటు వ్యాధుల నివారణ నిపుణుడు ఆంథోనీ ఫౌచీ. సంవత్సరం క్రితం కేవలం అమెరికాకు మాత్రమే పరిమైతమైన ఇతని పేరు.. కొవిడ్ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. అగ్రరాజ్యంలో కొవిడ్ కరాళ నృత్యం చేస్తున్న వేళ.. ఇతని మాటలే అమెరికన్లకు వేదం అయ్యాయి. ఫౌచీ చేసిన సూచనలను ప్రజలు తూచా తప్పకుండా పాటించారు. ఇదే విషయాన్ని పలు సర్వేలు వెల్లడించాయి. కరోనా నేపథ్యంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పోల్చితే ఫౌచీ మాటలనే ఎక్కువగా విశ్వసిస్తున్నట్టు సర్వేల్లో అమెరికన్లు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్.. ఫౌచీ ఓటర్లను ప్రభావితం చేయగలడని నమ్మి.. అతని అనుమతి లేకుండా ఓ వీడియోను కూడా ఎన్నికల ప్రచారంలో ఉపయోగించారు. అయితే అదికాస్తా వివాదాస్పదం కావడంతో.. ఆంథోనీ ఫౌచీ ప్రపంచానికి మరింత సుపరిచతం అయిన విషయం తెలిసిందే. 

కాగా.. ప్రస్తుతం జో బైడెన్ ప్రభుత్వంలో చీఫ్ మెడికల్ అడ్వైజర్‌గా ఆంథోనీ ఫౌచీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఫౌచీ అందుకుంటున్న జీతభత్యాలపై ఓ వార్త సంస్థ ఆరా తీయగా.. సంచలన విషయం బయటికొచ్చింది. ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ ద్వారా సదరు వార్తా సంస్థ.. ఫౌచీ వార్షిక వేతకం 4,17,608 డాలర్లని (ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.3.04కోట్లు) తెలుసుకుంది. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పొందే వార్షిక వేతనం కంటే ఫౌచీ 17,608 డాలర్లను అధికంగా తీసుకుంటున్నట్టు గుర్తించింది. దీనిపై కథనాలను వెలువరించింది. దీంతో ప్రస్తుతం ఈ అంశం అమెరికాలో చర్చనీయాంశంగా మారింది. అమెరికా అధ్యక్షుడి కంటే ఎక్కువ వార్షిక వేతనాన్ని అందుకునే అర్హత నిజంగా ఫౌచీకి ఉందా? అనే చర్చ అగ్రరాజ్యంలో ఊపందుకుంది. 

ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న వారు.. వారు వార్షిక వేతంగా 4,00,000 డాలర్లను (ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 2.91కోట్లు) అందుకుంటారు. వీటితోపాటు ట్రావెల్, వినోదం, తదితర అలవెన్సులను కూడా అదనంగా అందుకుంటారు.

click me!