
రష్యా (Russia)తో పోరాడేందుకు ఉక్రెయిన్ పారామిలటరీ బలగాల్లో (paramilitary forces) చేరిన తమిళనాడు (Tamil Nadu)లోని కోయంబత్తూరు (Coimbatore) విద్యార్థి స్వదేశానికి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడని ఆయన తండ్రి తండ్రి తెలిపారు. ఆర్ సాయి నిఖేష్ (R Sainikhesh) అనే విద్యార్థి ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌లోని నేషనల్ ఏరోస్పేస్ యూనివర్సిటీలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు.
సాయి నిఖేష్ ఫిబ్రవరిలో వాలంటీర్లతో కూడిన పారామిలిటరీ యూనిట్ అయిన జార్జియన్ నేషనల్ లెజియన్ (Georgian National Legion)లో చేరాడు. ఆయన గతంలో ఎత్తు తక్కువగా ఉన్న కారణంగా భారత సైన్యంలో చేరేందుకు రెండు సార్లు తిరస్కరణకు గురయ్యాడు. కాగా ఆయన తండ్రి రవిచంద్రన్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు తమ కుటుంబంతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. తమ కుమారుడిని త్వరలోనే అక్కడి నుంచి తీసుకొస్తామని చెప్పారని ఆయన వివరించాడు.
రవిచంద్రన్ (ravi chandran) తన కుమారడైన సాయి నిఖేష్ తో మూడు రోజుల కిందట ఫోన్ లో మాట్లాడాడు. ఆ సమయంలో కుమారుడు ఇండియాకు వచ్చేందుకు అంగీకరించాడు. “ గత మూడు రోజులుగా నేను నా కుమారుడితో మాట్లాడలేకపోయాను. ఏ సమయంలోనైనా తమను సంప్రదించాలని అధికారులు కోరారు. మా కొడుకును త్వరలో ఉక్రెయిన్ నుంచి అధికారులు తీసుకొస్తారని ఆశిస్తున్నాము. ’’ అని ఆయన చెప్పారు. అయితే ఈ పరిణామంపై ఓ పోలీసు అధికారి స్పందించారు. ఆయన తల్లిదండ్రులు సాయి నిఖేష్ ను ఇండియాకు రావాలని కోరినప్పుడు, ఆ స్టూడెంట్ సరిగా స్పందించలేదని చెప్పారు.
రష్యాకు, ఉక్రెయిన్ కు మధ్య యుద్ధం ప్రారంభమైనప్పుడు ఆ స్టూడెంట్ ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించలేదు. రష్యా దాడి మొదలైన తరువాత కూడా సాయి నిఖేష్ ఇండియన్ ఎంబసీ (indian embassy)ని సంప్రదించలేదని ఓ అధికారి తెలిపారు. రష్యన్ దళాలతో పోరాడేందుకు ఉక్రేనియన్ ప్రభుత్వం కొత్తగా విదేశీ దళాలను ఏర్పాటు చేసింది. ఇందులో చేరిన సైనికులకు రోజుకు కొన్ని డాలర్ల చొప్పున అందజేస్తుంది.
ఈవెనింగ్ స్టాండర్డ్ ( Evening Standard) నివేదిక ప్రకారం.. రష్యాకు వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొనడానికి అనుభవజ్ఞులైన సైనికులను కోరుతూ ప్రకటనలు వెలువడ్డాయి. ఇవి UK, యూరప్, USలలో వంటి అనేక ప్రాంతాల్లో కనిపించాయి. ఉక్రెయిన్‌తో కలిసి నడిచేందుకు, రష్యా సైనికులతో పోరాడేందుకు అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్‌కీ అభ్యర్థన మేరకు ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ లెజియన్ ఆఫ్ ఉక్రెయిన్ టెరిటోరియల్ డిఫెన్స్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో 52 దేశాల నుండి 20,000 మంది వాలంటీర్లు ఉక్రెయిన్ కోసం పోరాడేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా పేర్కొన్నారు. కాగా కాగా రష్యా దండయాత్ర ప్రారంభమైనప్పటి నుండి సుమారు 1,300 ఉక్రేనియన్ సైనికులు మృతి చెందారని ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. అయితే ఉక్రెయిన్ బలగాల మృతికి సంబంధించిన వివరాలు వెల్లడించడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉండగా.. రష్యా దాడి వల్ల ఉక్రెయిన్ విడిచి వెళ్లిపోతున్న శరణార్థులకు బ్రిటన్ (Britain) అండగా నిలుస్తామని తెలిపింది. ఉక్రెయిన్ లో ఉన్న పౌరులకు ఇంటిని అందించడానికి సాయం చేస్తానని ప్రకటించింది. ‘‘హోమ్స్ ఫర్ ఉక్రెయిన్ ’’ (Homes for Ukraine) అనే కొత్త పథకం ప్రారంభిస్తామని తెలిపింది.