ఆఫ్గన్ కొత్త ప్రభుత్వానికి కూడా హైబతుల్లా అఖుంజాదానే సుప్రీం లీడర్.. ప్రకటించిన తాలిబన్లు..

By AN TeluguFirst Published Sep 2, 2021, 10:20 AM IST
Highlights

"తాలిబాన్ నాయకుడు ముల్లా హెబతుల్లా అఖుంద్‌జాదా కొత్త ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారు" అని తాలిబాన్ సాంస్కృతిక కమిషన్ సభ్యుడు అనాముల్లా సమంగాని తెలియజేశారు.

కాబూల్ : అఫ్గాన్ కొత్త ప్రభుత్వానికి సుప్రీం లీడర్ గా హైబతుల్లా అఖుంజాదా నే అధిపతిగా ఉంటారని బుధవారం తాలిబాన్లు తెలియజేశారు. ఏర్పడబోయే 
ప్రభుత్వంలో ప్రధానమంత్రి పదవి కూడా ఉంటుందని ఇప్పటికే నివేదికలు సూచిస్తున్నాయని టోలో న్యూస్ నివేదించింది.

"తాలిబాన్ నాయకుడు ముల్లా హెబతుల్లా అఖుంద్‌జాదా కొత్త ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారు" అని తాలిబాన్ సాంస్కృతిక కమిషన్ సభ్యుడు అనాముల్లా సమంగాని తెలియజేశారు.

"మేము ప్రకటించే ఇస్లామిక్ ప్రభుత్వం ప్రజలకు ఆదర్శంగా ఉంటుంది. ప్రభుత్వంలో కమాండర్ ఆఫ్ ఫెయిత్‌ఫుల్ (అఖుంజాదా) ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయనే ప్రభుత్వానికి నాయకుడిగా ఉంటాడు" అని ఆయన అన్నారు.

అంతకాదు, తాలిబాన్లు సెప్టెంబర్ 3న దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటును కూడా ప్రకటించనున్నట్లు స్పుత్నిక్ నివేదించింది. అంతకుముందు ఆగస్టు 31 న, ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి గురించి చర్చించడానికి దోహాలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా రాయబారిని స్టానెక్‌జాయ్ కలిశారు.

ఇదిలా ఉండగా, తాలిబాన్ రాజకీయ కార్యాలయ అధిపతి ముల్లా బరదార్ కూడా ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రిగా నియమించబడ్డారని స్థానిక మీడియా తెలిపింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సంప్రదింపులు పూర్తయ్యాయని తాలిబాన్లు చెప్పినప్పటికీ, వ్యవస్థ పేరు, జాతీయ జెండా లేదా జాతీయ గీతంపై చర్చలు జరగలేదని టోలో న్యూస్ నివేదించింది.

click me!