ప్రియుడి మోసం.. భవనానికి నిప్పుపెట్టి 46మంది ప్రాణాలు తీసిన ప్రియురాలు..కోర్టు ఏమందంటే...

By Bukka SumabalaFirst Published Aug 6, 2022, 9:07 AM IST
Highlights

ప్రియుడు మోసం చేశాడన్న కోపంతో.. అతడిని ఇబ్బంది పెట్టాలని.. ఓ బిల్డింగ్ కు నిప్పుపెట్టింది ప్రియురాలు. దీంతో.. అందులోని 46మంది అగ్నికి ఆహుతికాగా, 41మంది గాయాల పాలయ్యారు. 

తైవాన్ : ప్రేమ పేరుతోనో.. స్నేహం పేరుతోనో మోసపోవడం.. తీవ్రంగా కలిచివేస్తుంది. కొన్నిసార్లు దాన్నుంచి వెంటనే తేరుకున్నా.. మోసం తీవ్రతను బట్టి కొంతమంది ఆ దారుణాన్ని జీర్ణించుకోలేకపోతారు. దీంతో  మరొకరిని నమ్మాలన్నా, ప్రేమించాలి అన్నా భయపడుతుంటారు.  ఇలాంటి పరిస్థితి ఎదురైతే  సాధ్యమైనంత తొందరగా దాని నుంచి బయట పడేందుకు ప్రయత్నించాలి.  కొన్నిసార్లు కాలం గడిచిన కొద్ది దీంట్లో మార్పు వస్తుంటుంది. పరిస్థితి మళ్లీ మామూలు గా మారిపోతుంది. అయితే, కొంతమంది ఈ మోసాన్ని తట్టుకోలేక తమనితాము గాయపరచుకోవడమో.. ఇతరులకు హాని తలపెట్టడమో చేస్తుంటారు. సరిగ్గా అలాంటి పనే చేసింది ఓ మహిళ.

వివరాల్లోకి వెళితే..  తైవాన్ లోని 51 యేళ్ల హువాంగ్ కేకే అనే మహిళ తన ప్రియుడు మోసం చేశాడన్న కోపంతో కాహ్ సియుంగ్ లో ఉన్న బహుళ అంతస్తుల భవనానికి నిప్పు అంటించింది. దీంతో సుమారు 46 మంది మృతి చెందగా.. దాదాపు 41 మంది గాయపడ్డారు. దీంతో పోలీసులు ఆమెపై హత్యానేరం కింద కేసులు నమోదు చేసి, అరెస్టు చేశారు. అయితే కోర్టులో ఆమె ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడిందని, పైగా, ఆమెలో పశ్చాత్తాపం కూడా లేదంటూ ఉరితీయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు.

Russia Ukraine War: ఉక్రెయిన్ యువతిని పెళ్లి చేసుకున్న రష్యా పౌరుడు.. వేద మంత్రాలతో వివాహం (వీడియో)

అయితే కోర్టు.. విచారణలో ఆమెను దోషిగా నిర్ధారించింది. కానీ, భవనంలో నివాసితులకు నష్టం కలిగించే ఉద్దేశం ఆమెకు లేదని పేర్కొంది. అంతేకాదు ఆమె ఉద్దేశపూర్వకంగా ఈ ఘటనకు పాల్పడ లేదని కూడా స్పష్టం చేసింది. ప్రియుడు మోసం చేయడంతో.. ఆ విషయాన్ని జీర్ణించుకోలేక ఆవేశంతో.. సదరు వ్యక్తిని ఇబ్బందులకు గురి చేసేందుకు ఈ ఘటనకు పాల్పడినట్లు పేర్కొంది. పైగా దీన్ని ఉద్రేకపూరితమైన చర్యగా భావించిన.. కోర్టు ఆమెకు జీవిత ఖైదు విధించింది. అయితే ఆమె తన నేరాన్ని కోర్టులో ఒప్పుకుంది. కానీ ఈ ఘటనకు పాల్పడే ముందు అసలు ఏం జరిగింది అనేది అస్పష్టంగా ఉంది. ఈ తీర్పుతో అసంతృప్తి చెందిన న్యాయవాదులు హైకోర్టుకు అప్పీలుకు వెళ్తామని తేల్చి చెప్పారు. 

click me!