Russia Ukraine War: ఉక్రెయిన్ యువతిని పెళ్లి చేసుకున్న రష్యా పౌరుడు.. వేద మంత్రాలతో వివాహం (వీడియో)

By Mahesh KFirst Published Aug 5, 2022, 4:42 PM IST
Highlights

హిమాచల్ ప్రదేశ్‌లో రష్యా పౌరుడు.. ఆయన గర్ల్‌ఫ్రెండ్ అయిన ఉక్రెయిన్ పౌరురాలు హిందు సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. ఈ నెల 2వ తేదీన వేద మంత్రోచ్ఛరణలతో ఏకమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నది.
 

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రష్యా ఉక్రెయిన్‌ల మధ్య యుద్దం కొనసాగుతూనే ఉన్నది. ఇరువైపులా జవాన్లు మరణించారు. ఈ రెండు దేశాల మధ్య ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి. యుద్ధ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. కానీ, ఆ యుద్ధం ఓ ప్రేమ జంటను విడదీయలేకపోయింది. ఉక్రెయిన్‌కు చెందిన యువతి, రష్యాకు చెందిన యువకుడు రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. తాజాగా, హిమాచల్ ప్రదేశ్‌లో వేద మంత్రాల నడుమ హిందూ సాంప్రదాయంలో పెళ్లి చేసుకుని ఏకమయ్యారు.

రష్యా పౌరుడు సెర్జీ నొవికోవ్, ఉక్రెయిన్‌కు చెందిన ఎలొనా బ్రమోకాలు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రేమించుకుంటున్నారు. రెండేళ్లుగా వారు ప్రేమలో ఉన్నారు. సుమారు ఏడాది కాలంగా వీరు హిమాచల్ ప్రదేశ్‌లోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ ఆలయంలో పురోహితుడు వీరికి ఈ నెల 2వ తేదీన పెళ్లి చేశారు. ఈ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. యూరప్‌కు చెందిన ఈ లవర్స్ హిందూ సాంప్రదాయంలో పెళ్లి చేసుకోవడం ఎంతో మందిని ఆకర్షించింది. వీడియోకు సుమారు 40 వేల వరకు వ్యూస్ వచ్చాయి.

ఈ పెళ్లి తంతు హిమాచల్ ప్రదేశ్‌లో ధర్మశశాలలో ధరమ్‌కోట సమీపంలోని దిశ్య ఆశ్రమ్ కరోతలో జరిగింది. ఈ జంట సుమారు ఏడాది కాలంగా అక్కడే ఉంటున్నట్టు ఆ ఆశ్రయ పండితుడు తెలిపాడు. ఓ పండితుడు ఆయన కుటుంబం సహాయంతో వారికి పెళ్లి చేశాడు. బ్రమోకాను కన్యాదానం కూడా చేశారు. ఆ పండితుడు ఓ అనువాదకుడినీ నియమించుకున్నాడు. తద్వార మంత్రాల ఉచ్ఛరణ.. మధ్యలో జరిగే తంతును ఆయనకు వివరించడం సులువు అయింది.

click me!