
Syria : రష్యా- ఉక్రెయిన్ల మధ్య జరుగుతోన్న యుద్దం వల్ల ప్రపంచ దేశాలు వణుకుతోన్నాయి. రష్యా దూకుడు చూస్తుంటే.. ఎప్పుడూ ఎలాంటి బాంబులు ప్రయోగిస్తుందోనన్న ప్రపంచ మానవాళి భయపడుతోంది. ఈ ఇలాంటి భయాంనక పరిస్థిత్తుల్లో సిరియాలో సైనికుల వాహనంపై మిలిటెంట్లు ఉగ్రదాడి పాల్పడ్డారు. ఈ దాడిలో 13 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకెళ్తే.. ఆదివారం సెంట్రల్ సిరియాలోని ఎడారి మార్గం నుండా ప్రయాణిస్తున్న సైనిక బస్సుపై మిలిటెంట్లు ఆకస్మిక దాడి చేశారు. ఈ ఘటనలో 13 మంది సిబ్బంది మృతి చెందారు. పాల్మీరా ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో మరో 18 మంది గాయపడ్డారని ప్రభుత్వ వార్తా సంస్థ సనా తెలిపింది . మృతుల్లో పలువురు అధికారులు కూడా ఉన్నట్లు ఆ దేశ అధికారిక మీడియా సంస్థ సనా పేర్కొంది. అత్యాధునికమైన ఆయుధాలతో దాడి చేసినట్లు వెల్లడించింది. అయితే ఈ దాడికి ఎవరు కారణమన్నది తెలియలేదు.
సిరియా అధికారులు.. 2019 నుంచి దేశంలో ప్రాదేశిక నియంత్రణను కోల్పోయినప్పటికీ.. దక్షిణ,మధ్య సిరియాల్లో క్రియాశీలకంగా ఉన్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రమూకలు గతంలో ఇటువంటి దాడులకు పాల్పడ్డారు. జనవరిలో పాల్మీరా ప్రాంతంలోనే భద్రతా దళాల వాహనంపై ఐఎస్ ఉగ్రవాదులు రాకెట్లు, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్‌తో కాల్పులు జరిపగా.. ఐదుగురు సైనికులను ప్రాణాలు కోల్పోయారు.దీంతో తాజాగా దాడి కూడా ఐఎస్ ఉగ్రవాదులే చేసి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నార. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు ఉక్రెయిన్ రష్యా ల మధ్య యుద్ధం 11వ రోజుకు చేరింది. ఉక్రెయిన్ నగరాలు, పట్టణాలపై రష్యన్ సైన్యాలు విరుచకపడుతున్నాయి. ఇప్పటికే ఖేర్సన్, మరియుపోల్, వోల్నోవాఖ నగరాలను రష్యా బలగాలు ఆక్రమించాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను హస్తగతం చేసుకోవాలని.. రష్యా దళాలు బాంబు దాడులను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ బలగాలు కూడా ఏ మాత్రం తగ్గేదేలే.. అన్నట్టు ప్రతిఘటిస్తున్నాయి.
దీంతో ఉక్రెయిన్ నగరాల్లో ఎటు చూసినా.. బాంబు పేలుళ్లు, మిసెల్స్ దాడులతో ఉక్రెయిన్ నగరాలు.. శ్మశానాల్లా మారాయి. దీంతో ఇక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. రష్యా దాడుల్లో ఆ దేశ ప్రజలే కాదు.. అక్కడ నివాసం ఉంటున్న ఇతర దేశాల ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే యుద్దం తక్షణమే నిలివేయాలని ఐక్యరాజ్యసమితితో పాటు ప్రపంచ దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.