భారత సంతతికి చెందిన అమెరికన్ మహిళా టెక్కీ అనుమానాస్పద మృతి.. టెక్సాస్ లో ఘటన

By Asianet NewsFirst Published May 18, 2023, 9:41 AM IST
Highlights

టెక్సాస్ లో నివసిస్తున్న ఇండో - అమెరికన్ యువతి లహరి పతివాడ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆమె ఎప్పటిలాగే ఈ నెల 12వ తేదీన ఆఫీసుకు వెళ్లారు. అప్పటి నుంచి కనిపించకుండాపోయారు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

టెక్సాస్ నుంచి అదృశ్యమైన 25 ఏళ్ల భారత సంతతి అమెరికన్ మహిళ టెక్కీ లహరి పతివాడ శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మే 12న విధులకు వెళ్లి అదృశ్యమైన మరుసటి రోజే 322 మైళ్ల దూరంలోని ఓక్లహోమాలో ఆమె మృతదేహం లభ్యమైంది. టెక్సాస్ లోని కొలిన్స్ కౌంటీలోని మెక్ కిన్నీ నివాసి అయిన ఆమె.. చివరిసారిగా డల్లాస్ శివారులోని ఎల్ డోరాడో పార్క్ వే, హార్డిన్ బౌలేవార్డ్ ప్రాంతంలో నల్లటి టయోటా కారును నడుపుతూ కనిపించింది.

ప్రత్యక్ష రాజకీయాల్లోకి వైఎస్ అభిషేక్‌రెడ్డి.. పులివెందుల బాధ్యతలు అప్పగించనున్న వైసీపీ..! ఇంతకీ ఆయన ఎవరంటే ?

ఈ నెల 12న విధులు ముగించుకుని ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఆమె ఫోన్ కు కుటుంబ సభ్యులు, స్నేహితులు కాల్ చేసినా స్పందన రాలేదు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఈ విషయంలో దర్యాప్తు ప్రారంభించారు. అయిేత లహరి కనిపించకుండా పోయిందనే ఘటన టెక్సాస్ లోని వావ్ కమ్యూనిటీ గ్రూప్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

వీడిన ప్రతిష్టంభన.. కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్.. 20న ప్రమాణ స్వీకారం..

ఈ పోస్టు వైరల్ గా మారింది. లహరి పతివాడ ఫేస్ బుక్ పేజీ ప్రకారం.. ఆమె ఓవర్ ల్యాండ్ పార్క్ రీజనల్ మెడికల్ సెంటర్ లో పనిచేస్తున్నారు. కాన్సాస్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలైంది. బ్లూ వ్యాలీ వెస్ట్ హైస్కూల్ లో చదువుకున్నారు. అయితే ఆమె మృతదేహం ఎలా లభించింది ? ఆమె మరణానికి కారణాలు ఏంటనే విషయాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 

click me!