సునీత విలియమ్స్ భూమిపైకి తిరిగి రావడానికి ఇంత ప్రాసెస్‌ ఉందా.? స్పేస్‌ నుంచి లైవ్‌ వీడియో. చూసేయండి..

అంతరిక్షంలో సుమారు 9 నెలల పాటు చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్‌, బచ్‌ విల్మోర్‌లు ఎట్టకేలకు భూమిపైకి తిరుగుపయనమయ్యారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 నిమిషాలకు భూమ్మీదికి చేరుకోనున్నారు.. 
 

Sunita Williams Returns to Earth After 9 Months in Space Watch the Live Video of Her Journey VNR

కేవలం 8 రోజుల ప్రయాణం కోసం అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి వెళ్లిన వ్యోమగాములు సునీత విలియమ్స్‌, బచ్‌ విల్మోర్‌లు సాంకేతిక సమస్యల కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. దీంతో ఏకంగా 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండాల్సి వచ్చింది. వారిని తిరిగి తీసుకొచ్చేందుకు నాసాతో పాటు ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ సంస్థ తీవ్ర ప్రయత్నం చేసింది. అయితే ఇప్పటి వరకు పలుసార్లు ఈ ప్రయోగం వాయిదా పడగా. తాజాగా ఎట్టకేలకు వ్యోమగాముల తిరుగు ప్రయాణం మొదలైంది. 

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి రోదసిలోకి వెళ్లిన స్పేస్‌ఎక్స్‌ వ్యోమనౌక క్రూ డ్రాగన్‌లోకి వ్యోమగాములు చేరుకున్నారు. కాగా ప్రస్తుతం వ్యోమగాముల తిరుగు ప్రయాణం తిరిగి ప్రారంభమైంది. మన కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.30 గంటలకు ఐఎస్‌ఎస్ నుంచి నౌక బయలుదేరింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు ఫ్లోరిడా సముద్రంలో నౌక దిగనుంది. అక్కడి నుంచి ప్రత్యేక పడవల ద్వారా తీరానికి చేరుకుంటారు.

Latest Videos

అయితే చెప్పడానికి సింపుల్‌గానే ఉన్నా దీని వెనకాల పెద్ద ప్రాసెస్‌ ఉంటుంది. వ్యోమ నౌకలోకి ఎంటర్‌ కావడం నుంచి మొదలు భూమిపైకి చేరుకునేంత వరకు ఎంతో క్లిష్టమైన ఘట్టాలు ఉంటాయి. ఈ ప్రాసెస్‌ అంతటిని నాసా లైవ్‌ టెలికాస్ట్‌ చేస్తోంది. వ్యోమనౌక, అంతరిక్ష కేంద్రం నుంచి ఎలా అన్‌లాక్ అయ్యింది. భూమిపైకి ఎలా వస్తోంది.? లాంటి అన్ని వివరాలు ఈ వీడియోలో చూడొచ్చు. మరెందుకు ఆలస్యం ఈ అద్భుతమైన దృశ్యాలను మీరు కూడా చూసేయండి. 

లైవ్‌ వీడియో.. 

 

vuukle one pixel image
click me!