విమానంలో నుంచి కింద పడి వ్యక్తి మృతి

Published : Jul 02, 2019, 03:41 PM IST
విమానంలో నుంచి కింద పడి వ్యక్తి మృతి

సారాంశం

ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానం నుంచి కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన లండన్ లో చోటుచేసుకుంది. కాగా... ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 

ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానం నుంచి కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన లండన్ లో చోటుచేసుకుంది. కాగా... ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. జూన్ 30వ తేదీన ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కెన్యా ఎయిర్ లైన్స్ కి చెందిన ఓ విమానం లండన్ లోని హీట్ త్రో విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకొని బయల్దేరింది. దక్షిణ లండన్ మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో విమానం నుంచి ఓ వ్యక్తి అకస్మాత్తుగా కిందకి పడిపోయాడు. దీంతో.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

దక్షిణ లండన్‌లోని ఓ గార్డెన్‌లో గుర్తు తెలియని మృత దేహం ఉందని పోలీసులకు సాయంత్రం 3:39 గంటలకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని విచారించగా ఈ ప్రమాదం వెలుగు చూసింది.
 
కాగా మరణించిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియలేదని, మృత దేహాన్ని పోస్టు మార్టు నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. వివరాలు కనుక్కుని కుటుంబ సభ్యలకు గానీ, బంధువులకు గానీ శవాన్ని అప్పగించనున్నట్లు వారు పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

20 వేల కిలో మీట‌ర్లు, 21 రోజుల ప్ర‌యాణం.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద రైలు మార్గం. ఈ ఊహ ఎంత బాగుందో..
India Oman: మోదీ మాస్ట‌ర్ ప్లాన్, ఒమాన్‌తో కీల‌క ఒప్పందం.. దీంతో మ‌న‌కు లాభం ఏంటంటే..