పైలట్ల అప్రమత్తత 525 మందిని కాపాడింది.. ఆకాశంలో తప్పిన పెనుప్రమాదం..

Published : Jun 16, 2022, 10:44 AM IST
పైలట్ల అప్రమత్తత 525 మందిని కాపాడింది.. ఆకాశంలో తప్పిన పెనుప్రమాదం..

సారాంశం

శ్రీలంకన్ పైలట్ల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. దాదాపు 500మందికి పైగా ప్రాణాలతో బయటపడ్డారు. ఇంతకీ వారేం చేశారంటే.. 

కొలంబో : SriLankan Airlinesకు చెందిన విమానంలోని పైలెట్లు అప్రమత్తతతో తుర్కియే గగనతలంలో భారీ ప్రమాదం తప్పింది. రెండు విమానాలు ఢీ కొనే పరిస్థితిని నివారించి 525 మంది ప్రయాణికులను కాపాడినందుకు pilotsపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం ఆ సంస్థకు చెందిన యూఎల్-504 విమానం ఈ నెల 13న లండన్ నుంచి కొలంబోకు 275 మంది ప్రయాణీకులతో బయలుదేరింది. తుర్కియే గగనతలంలో 33 వేల అడుగుల ఎత్తులో వెళ్తున్నప్పుడు 35 వేల అడుగుల ఎత్తుకు ఎగరాలని పైలెట్లకు Ankara Air Traffic Control (ఏటీసీ) కేంద్రం నుంచి ఆదేశాలు అందాయి. అదే ఎత్తులో  కేవలం 15  మైళ్ల దూరంలో ఓ విమానం వస్తున్నట్లు శ్రీలంక విమానం పైలెట్లు గుర్తించారు. 

ఈ విషయాన్ని ఏటీసీ కేంద్రానికి తెలియజేశారు. కానీ ఏటీసీ వ్యవస్థ మాత్రం పైకి ఎగరడానికి రెండుసార్లు క్లియరెన్స్ ఇచ్చింది.  ప్రమాదాన్ని పసిగట్టిన పైలెట్లు 35 వేల అడుగుల ఎత్తుకు విమానాన్ని తీసుకు వెళ్లడానికి నిరాకరించారు. పొరపాటును గుర్తించిన ఏటీసీ కేంద్రం పైకి ఎగరవద్దని, అదే ఎత్తులో దుబాయ్ కి వెళ్తున్న బ్రిటీష్ ఎయిర్వేస్కు చెందిన విమానం 250 మంది ప్రయాణికులతో వస్తోందని సమాచారం ఇచ్చింది.  ఏటీసీ వ్యవస్థ ఆదేశాల ప్రకారం పైలట్లు 35 వేల అడుగుల ఎత్తుకు తీసుకు వెళ్లి ఉంటే, రెండు విమానాలు ఢీ కొని పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని శ్రీలంక ఎయిర్ లైన్స్ పేర్కొంది. 

చైనా నిజంగానే గ్రహాంతరవాసుల సంకేతాలను గుర్తించిందా?

కాగా, మే 12న చైనాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. చైనా విమానాశ్రయంలో టిబెట్ ఎయిర్‌లైన్స్ విమానం ఒకటి రన్‌వే నుండి జారిపోయింది. దీంతో విమానంలో మంటలు చెలరేగాయి. అయితే, ప్రమాదాన్ని వెంటనే గమనించడంతో ప్రయాణికులు, సిబ్బంది అందరూ “సురక్షితంగా బయటపడ్డారు” అని ఎయిర్‌లైన్స్ తెలిపింది. 113 మంది ప్రయాణికులు, తొమ్మిది మంది సిబ్బందితో కూడిన విమానం నైరుతి నగరం చాంగ్‌కింగ్ నుండి టిబెట్‌లోని న్యింగ్‌చికి వెళుతుండగా, సిబ్బంది విమానంలో ఏదో తేడా, "సస్పెండ్ టేకాఫ్" గమనించామని, అంతలోనే  జెట్ రన్‌వేను నుంచి జారిపోయిందని, వెంటనే రంగంలోకి దిగి మంటలను ఆర్పినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 

దీంతో జెట్ లోని ప్రయాణికులు భయాందోళనకు గురై సంఘటనా స్థలం నుండి పరుగులు తీశారు. ప్రమాదానికి గురైన జెట్ రెక్కలకు మంటలు వ్యాపించినట్లు చైనా ప్రభుత్వ మీడియా షేర్ చేసిన ఫొటోల్లో కనిపిస్తుంది. అయితే ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఏమీ కాలేదని, ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఖాళీ చేయబడ్డారు" అని టిబెట్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. "కొంతమంది ప్రయాణీకులందరూ స్వల్పంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాం" అని తెలిపారు. 

మార్చిలో కున్మింగ్ నుండి గ్వాంగ్‌జౌకు ప్రయాణిస్తున్న చైనా ఈస్టర్న్ విమానం 29,000 అడుగుల ఎత్తు నుండి పర్వత ప్రాంతంలోకి పడిపోవడంతో అందులో ఉన్న 132 మంది మరణించిన ఘటన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. ఇది చైనాలో 30 సంవత్సరాలలో  జరిగిన అతి ఘోరమైన విపత్తు.

ఈ ప్రమాదంలో రెండు ఫ్లైట్ రికార్డర్‌లు లేదా "బ్లాక్ బాక్స్‌లు" దొరికాయి. చైనా ఈస్టర్న్ జెట్ అంత వేగంగా ఎలా కిందికి పడింది.. ఆ సమయంలో ఏం జరిగింది అనే దాని వెనకున్న రహస్యాన్ని చేధించడానికి యునైటెడ్ స్టేట్స్‌లో ఈ బ్లాక్ బాక్స్ లను పరిశీలిస్తున్నారు. పరిశోధనల్లో విమాన, క్యాబిన్ సిబ్బంది అర్హతలు అవసరాలకు అనుగుణంగా ఉన్నాయా, లేదా అనే దిశగా కూడా సాగాయి. 

 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే