ఇండియన్ సీక్రెట్ ఏజెన్సీ ‘రా’ నన్ను చంపాలనుకుంటోంది : శ్రీలంక అధ్యక్షుడు

sivanagaprasad kodati |  
Published : Oct 17, 2018, 12:03 PM IST
ఇండియన్ సీక్రెట్ ఏజెన్సీ ‘రా’ నన్ను చంపాలనుకుంటోంది : శ్రీలంక అధ్యక్షుడు

సారాంశం

ఇండియన్ సీక్రెట్ ఏజెన్సీ ‘‘రా’’ తన హత్యకు కుట్రపన్నిందంటూ సంచలన ఆరోపణలు చేశారు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రీసెర్చ్ అండ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) తన హత్యకు కుట్ర పన్నినట్లు తెలిపారు

ఇండియన్ సీక్రెట్ ఏజెన్సీ ‘‘రా’’ తన హత్యకు కుట్రపన్నిందంటూ సంచలన ఆరోపణలు చేశారు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రీసెర్చ్ అండ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) తన హత్యకు కుట్ర పన్నినట్లు తెలిపారు..

‘‘రా’’ తన హత్యకు కుట్ర పన్నినట్లు ప్రధాని మోడీకి కూడా తెలియదని సిరిసేన అన్నారు. అయితే శ్రీలంక అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యల పట్ల ‘‘రా’’ నుంచి ఎటువంటి అధికారిక ధ్రువీకరణ లేదు. మరోవైపు మరికొద్దిరోజుల్లో మైత్రిపాల భారత పర్యటనకు రానున్నారు.

మరోవైపు శ్రీలంక నేతలు ‘‘రా’’పై ఆరోపణలు చేయడం కొత్తేమి కాదు.. 2015 శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పాత్ర ఉందని.. మాజీ అధ్యక్షుడు మహేంద్ర రాజపక్షే ఆరోపించారు.

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !