ఎన్నికల ర్యాలీలో బాంబు దాడి:12మంది దుర్మరణం

By Nagaraju TFirst Published Oct 13, 2018, 9:23 PM IST
Highlights

ఆఫ్ఘనిస్థాన్ మరోసారి రక్తమోడింది. ఎన్నికల ర్యాలీని లక్ష్యంగా చేసుకుని జరిపిన బాంబు దాడిలో 12 మంది దుర్మరణం చెందారు. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని తకార్ ప్రావిన్స్‌లో ఈ ఘటన చచోటు చేసుకుంది. ఈ నెల 20న పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్నాయి. 
 

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ మరోసారి రక్తమోడింది. ఎన్నికల ర్యాలీని లక్ష్యంగా చేసుకుని జరిపిన బాంబు దాడిలో 12 మంది దుర్మరణం చెందారు. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని తకార్ ప్రావిన్స్‌లో ఈ ఘటన చచోటు చేసుకుంది. ఈ నెల 20న పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్నాయి. 

ఈ ఎన్నికల్లో బరిలోకి దిగిన నజీఫా యూసుఫిబెక్ ప్రచారం చేస్తుండగా ఒక్కసారిగా బాంబు పేలింది. దీంతో ప్రచారంలో పాల్గొన్న సుమారు 12 మంది దుర్మరణం చెందగా మరో 30 మంది ప్రాణాలతో పోరాటం చేస్తున్నారు. నజీఫాకు మద్దతుగా జరిగిన ర్యాలీలో మోటార్ సైకిల్‌పై అమర్చిన బాంబు పేలినట్టు ప్రావిన్షియల్ గవర్నర్ అధికారి ప్రతినిధి మహమ్మద్ జవాద్ హేజ్రీ స్పష్టం చేశారు. బాంబు పేలుడు జరిగిన సమయంలో అభ్యర్థి నజీఫా అక్కడ లేరని పోలీసులు తెలిపారు.
 
బాంబు పేలుడు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గత కొద్దిరోజులుగా బాంబు పేలుడులతో కాబూల్ దద్దరిల్లుతోంది.  అయితే ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించలేదు. దేశవ్యాప్తంగా మొత్తం 417 మంది మహిళలు ఎన్నికల్లో పోటీ పడుతుండగా అందులో నజీఫా ఒకరు. 

గతంలో ఎప్పుడూ ఇంతమంది అభ్యర్థులు పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేసిన దాఖలాలు లేవు. అలా అని ఏనాడు ఇంతలా బాంబుల దాడులు కూడా జరగలేదని హేజ్రీ తెలిపారు.  ఇప్పటి వరకు జరిగిన ఉగ్ర దాడుల్లో ఐదుగురు పురుష అభ్యర్థులు మృతి చెందినట్లు తెలిపారు. మరో ఇద్దరిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఐదుగురిని తీవ్రంగా గాయపరిచినట్లు హేజ్రీ తెలిపారు.

click me!