శ్రీలంకలో ఆదివారం నాడు వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. ఎనిమిది దఫాలు బాంబు పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. ఈ బాంబు పేలుళ్ల కారణంగా రేపు సాయంత్రం వరకు కర్ఫ్యూను విధించారు
కొలంబో: శ్రీలంకలో ఆదివారం నాడు వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. ఎనిమిది దఫాలు బాంబు పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. ఈ బాంబు పేలుళ్ల కారణంగా రేపు సాయంత్రం వరకు కర్ఫ్యూను విధించారు.
ఆదివారం నాడు ఉదయం నుండి 8 దఫాలు బాంబు పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. ఆస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ దాడులకు పాల్పడ్డారు. ఈ బాంబు పేలుళ్లతో ఇప్పటివరకు 185 మంది మృతి చెందారు. మరో 400 మందికి పైగా గాయపడ్డారు.
undefined
బాంబు పేలుళ్లలో 35 మంది విదేశీయులు మృతి చెందారు. శ్రీలంకలో హై అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. సోమవారం సాయంత్రం వరకు శ్రీలంక వ్యాప్తంగా కర్ప్యూ విధించింది. మరో వైపు సోషల్ మీడియాపై కూడ ఆంక్షలు విధించారు.
ఈ వరుస బాంబు పేలుళ్ల వెనుక ఐసీస్ హస్తం ఉందని లంక ప్రభుత్వం అనుమానిస్తోంది. ఆత్మాహుతి దాడులకు పాల్పడిన ఇద్దరిని లంక ప్రభుత్వం గుర్తించింది. వరుస బాంబు దాడులతో శ్రీలంక చిగురుటాకులా వణుకుతోంది.
భద్రతా సిబ్బంది అత్యవసరంగా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కోలంబోను సైన్యం తమ ఆధీనంలోకి తీసుకొన్నారు. హోటల్స్ లో ఆర్మీ విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. ఎయిర్‌పోర్ట్‌లపై ఉగ్ర మూకలు దాడికి పాల్పడే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై కూడ ఇవాళ సాయంత్రానికి కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
సంబంధిత వార్తలు
శ్రీలంకలో వరుస పేలుళ్లు: ఆత్మాహుతి దాడికి పాల్పడింది వీరే
10 రోజుల ముందే హెచ్చరించినా పట్టించుకోని శ్రీలంక సర్కార్
శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లు: హై అలర్ట్
కొలంబోలో బాంబు పేలుళ్లు: 160 మంది మృతి, 300 మందికి గాయాలు