ఫైజర్, మోడెర్నా టీకాలతో వీర్యకణాల సంఖ్య తగ్గుతుందా?

By AN TeluguFirst Published Jun 19, 2021, 10:09 AM IST
Highlights

పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యానికి ఫైజర్, మోడెర్నా టీకాలు ఏమాత్రం హాని కలిగించవని తాజా అధ్యయనమొకటి తేల్చింది. వీర్యకణాల సంఖ్యను అవి తగ్గించవని నిర్థారించింది. 18-50 యేళ్లమధ్య వయసున్న 45మంది వాలంటీర్ల మీద అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మియామి పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. 

ఇందులో భాగంగా తొలి డోసు వేయడానికి 2-7 రోజుల ముందు వాలంటీర్ల నుంచి వీర్యం సేకరించారు. రెండో డోసు పూర్తయ్యాక దాదాపు 70 రోజులకు మరోసారి వాలంటీర్ల నుంచి వీర్యం సేకరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్వో) ప్రమానాలకు అనుగుణంగా, వీర్యం పరిమణం, గాఢత, వీర్యకణాల చలనశీలత వంటి అంశాలను పరిశీలించారు.

టీకా వేయించుకున్నాక ఏ ఒక్కరిలోనూ సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గలేదేని గుర్తించారు. వాస్తవానికి రెండు డోసులు పూర్తయ్యాక వరిలో వీర్యకణాల సంఖ్య, చలనశీలత కొంతమేరకు మెరుగైందని పేర్కొన్నారు. ఫైజర్, మోడెర్నాల్లో సజీవ వైరస్ కాకుండా ఎంఆర్ఎన్ఏ ఉంటుందని పరిశోధకులు గుర్తు చేశారు. వీర్యం మీద అవి ప్రభావం చూపూ అవకాశల్లేవని తేల్చి చెప్పారు. 

click me!