వేలల్లో తగ్గిన టీవీ ధరలు !

First Published May 30, 2018, 6:21 PM IST
Highlights

ఇప్పుడు రూ.20,000లకే 40 అంగుళాల టీవీ...

స్మార్ట్‌ టీవీల విక్రయాలు జోరుమీదున్నాయి.  ఈ కాలంలో కూడా టీవీ లేని కుటుంబాలు లక్షల్లో ఉన్నాయంటే అతియోశక్తి కాదు. దానికి కారణం ధర.. టీవీ కొనాలంటే కనీసం పది నుంచి ఇరవైవేలైన వెచ్చించాల్సిందే. కానీ ప్రస్తుతం అంత ధర పెట్టి కొనాల్సిన అవసరం లేదంటున్నాయి వివిధ టీవీ తయారీ సంస్థలు.

నాలుగేళ్లనుంచి స్మార్ట్ టీవీ శకం ఊపందుకుంది. మరో రకంగా చెప్పాలంటే స్మార్ట్‌ టీవీ మార్కెట్‌లో చౌక ధరల యుద్ధం ప్రారంభమైంది.  షావోమి, థామ్సన్, టీసీఎల్‌ వంటి గ్లోబల్‌ కంపెనీలు మన స్మార్ట్‌ టీవీ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. తక్కువ ధర, అధిక ఫీచర్లతో కొత్త మోడళ్లను ఆవిష్కరిస్తున్నాయి.

మార్కెట్ లో దిగ్గజ కంపెనీల 32 అంగుళాల స్మార్ట్‌ టీవీ ధర రూ.23,000ల నుంచి మొదలవుతోంది. ఒకప్పుడు వీటి ధర రూ.30,000కు పైగానే ఉండేది. టీసీఎల్‌ వంటి కంపెనీలు రూ.13,500 నుంచే 32 అంగుళాల స్మార్ట్‌ టీవీలను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. అంతేకాదు రూ.50,000 పలికే 40 అంగుళాల స్మార్ట్‌ టీవీ కేవలం రూ.20,000 కే దొరుకుతోంది . టీవీలు ప్రజలకు చేరువ అవడంలో ఫైనాన్స్‌ సదుపాయం పాత్ర మరువలేనిదని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. 

 

 

 

click me!