ఇంగ్లాండ్ లో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి...

Published : Aug 13, 2021, 10:32 AM IST
ఇంగ్లాండ్ లో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి...

సారాంశం

కాల్పులకు తెగబడిన దుండగులకు ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని ప్రాథమికంగా ధ్రువీకరించామన్నారు. మృతుల్లో కాల్పుల జరిపిన ఓ వ్యక్తి కూడా ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. 

లండన్ : నైరుతి ఇంగ్లాండ్ లోని ఫ్లైమౌత్ నగరంలో శుక్రవారం ఉదయం కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. కాల్పులకు తెగబడిన దుండగులకు ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని ప్రాథమికంగా ధ్రువీకరించామన్నారు. మృతుల్లో కాల్పుల జరిపిన ఓ వ్యక్తి కూడా ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. 

ఈ ఘటనలో మరికొంత మందికి గాయాలైనట్లు డెవాన్, కార్న్ వాల్ పోలీసులు ట్విట్టర్ లో పేర్కొన్నారు. వారిని ఆస్పత్రికిి తరలించినట్లు తెలిపారు. కీహామ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందించడానికి పోలీసులు నిరాకరించారు. ఎయిర్ అంబులెన్స్, పారా మెడికల్ సిబ్బంది త్వరితగతిన స్పందించారు. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?