ఫిలీప్పీన్స్ లో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!

Published : Aug 12, 2021, 08:36 AM IST
ఫిలీప్పీన్స్ లో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!

సారాంశం

పొందగటాన్ కు తూర్పు దిక్కుగా 63 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రకంపనలు సంభవించాయి. ఈ విషయాన్ని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.  


ఫిలిప్పీన్స్ లో భూకంపం సంభవించింది. ఫిలప్పీన్స్ లోని పొందగిటాన్ లో ఈ భూకంపం సంభవించడం గమనార్హం. ఇది రిక్టర్ స్కేల్ పై 7.1 తీవ్రత నమోదైంది. పొందగటాన్ కు తూర్పు దిక్కుగా 63 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రకంపనలు సంభవించాయి. ఈ విషయాన్ని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

65.6 కిలోమీటర్ల లోతులో  భూకంపం కేంద్రీకృతమైనట్లు పేర్కొంది. మరోవైపు యూఎస్ సునామీ హెచ్చరిక కేంద్రం ఫిలిప్పీన్స్ కు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఫిలప్పీన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వోల్కానాలజీ, సిస్మాలజీ భూకంప నష్టాన్ని అంచనా వేశాయి.

PREV
click me!

Recommended Stories

World's Coldest Village: ప్రపంచంలో అత్యంత చల్లని గ్రామం.. మైనస్ 67 డిగ్రీల చలిలో ఎలా బతుకుతున్నారు?
Global Religion Report: 2035 నాటికి ప్రపంచంలో అతిపెద్ద మతంగా ఇస్లాం.. క్రైస్తవులు, హిందువుల సంగతేంటి?