చైనా ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. 21మంది మృతి

By telugu news teamFirst Published Aug 13, 2021, 9:27 AM IST
Highlights

 వరదల ధాటికి విద్యుత్, రవాణా,కమ్యూనికేషన్ల వ్యవస్థలు దెబ్బతిన్నాయి.భారీ వర్షాల కారణంగా 21 మంది మరణించగా, దాదాపు 6,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు

చైనాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మధ్య చైనా ప్రావిన్స్ హుబేలో ఐదు నగరాల్లో కురుస్తున్న భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తడంతో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. సుయిజౌ నగరంలో భాగమైన లియులిన్ టౌన్‌షిప్‌లో వరదల వల్ల 21 మంది మరణించారు. 2,700 కి పైగా ఇళ్లు, దుకాణాలు వరదనీటిలో మునిగాయి. వరదల ధాటికి విద్యుత్, రవాణా,కమ్యూనికేషన్ల వ్యవస్థలు దెబ్బతిన్నాయి.భారీ వర్షాల కారణంగా 21 మంది మరణించగా, దాదాపు 6,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.యిచెంగ్ నగరంలో గురువారం రికార్డు స్థాయిలో 400 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

 సుజౌ, జియాంగ్యాంగ్, జియావోగన్ నగరాల్లో వరద సహాయ పనులు చేపట్టేందుకు చైనా అత్యవసర నిర్వహణ మంత్రిత్వి శాఖ రెస్క్యూ సిబ్బందిని పంపించింది. హుబేలోని 774 రిజర్వాయర్లు గురువారం సాయంత్రానికి వరదనీటితో నిండటంతో వరద హెచ్చరికలు జారీ చేశారు.వరదల వల్ల 8,110 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి.యాంగ్జీ నది వెంట ఉన్న ప్రాంతాల్లో వరదనీరు ప్రవహిస్తోంది. 

click me!