పాకిస్తాన్ లో దారుణం.. నలుగురు మహిళలను బట్టలూడదీసి, కొడుతూ.. వీధుల్లో ఊరేగించి, వీడియోతీసి...

By SumaBala BukkaFirst Published Dec 8, 2021, 8:40 AM IST
Highlights

ఓ టీనేజ్ అబ్బాయితో పాటు నలుగురు మహిళలను కొడుతూ నగ్నంగా, వీధుల్లో ఊరేగిస్తూ వీడియో తీశారు. ఈ వీడియోలో ఆ మహిళలు తమ దేహాలను కప్పుకోవడానికి గుడ్డ ముక్క ఇచ్చి తమ మానం కాపాడమని చుట్టుపక్కల వారిని దయనీయంగా వేడుకోవడం కనిపిస్తుంది. కానీ వారిని వీడియో తీయడం తప్ప ఎవ్వరూ కాపాడడానికి ముందుకు రాలేదు. 

పాకిస్తాన్ : pakistan లోని లాహోర్ లో అత్యంత అమానుష ఘటన చోటు చేసుకుంది. దేశంలోని Punjab Province‌లో దొంగతనం చేయడానికి వచ్చారన్న కారణంతో ఓ పురుషుడు, నలుగురు మహిళల మీద అత్యాంత పాశవికంగా వ్యవహరించారు. వారి బట్టలు ఊడదీసి, కొట్టారు. Nakedగా గంట పాటు వీధుల్లో ఊరేగించారు. 

ఈ ఘటన లాహోర్‌కు 180 కిలోమీటర్ల దూరంలోని ఫైసలాబాద్‌లో సోమవారం చోటుచేసుకుంది. బాధితుల్లో ఓ టీనేజ్ అబ్బాయితో పాటు నలుగురు మహిళలున్నారు. వీధుల్లో ఊరేగిస్తూ వీడియో తీశారు. ఈ వీడియో ఇప్పుడు viral గా మారింది. ఇందులో ఆ మహిళలు తమ దేహాలను కప్పుకోవడానికి గుడ్డ ముక్క ఇచ్చి తమ మానం కాపాడమని చుట్టుపక్కల వారిని దయనీయంగా వేడుకోవడం కనిపిస్తుంది. కానీ వారిని వీడియో తీయడం తప్ప ఎవ్వరూ కాపాడడానికి ముందుకు రాలేదు. సరికదా వారిని కర్రలతో కొట్టారు.

మహిళలు తమను వెళ్లనివ్వమని, తాము దొంగతనానికి రాలేదని ఏడుస్తూ ప్రజలను అభ్యర్థించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అలా వారిని గంటపాటు నగ్నంగా వీధుల్లో ఊరేగించారు. ఈ ఘటనకు సంబంధించిన రెండు వీడియోలు social mediaలో వైరల్ కావడంతో పాకిస్థాన్ పంజాబ్ పోలీసులు రంగంలోకి దిగారు.

రాబోయే మహమ్మారులు మరింత ప్రమాదకరం: ఆక్స్ ఫర్డ్ టీకా సృష్టికర్త హెచ్చరికలు

ఈ దురదృష్టకర ఘటనలో ఐదుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేశామని పంజాబ్ పోలీసు అధికార ప్రతినిధి మంగళవారం ట్వీట్‌లో తెలిపారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారని, ఇందులో బాధితులైన వారందరికీ న్యాయం చేస్తామని చెప్పారు.

చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం ఐదుగురు అనుమానితులతో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫైసలాబాద్‌లోని బావ చాక్ మార్కెట్‌కు చెత్త సేకరించేందుకు ఐదుగురు కలిసి వెళ్లినట్లు బాధితుడు తెలిపాడు. అయితే అక్కడవారు.. 

Pakistan: పాకిస్తాన్ సిగ్గు పడాల్సిన రోజు.. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు

"మేము దాహంతో ఉస్మాన్ ఎలక్ట్రిక్ స్టోర్ లోపలికి వెళ్లి water bottle అడిగాం. కానీ దాని యజమాని సద్దాం మాకు వాటర్ బాటిల్ ఇవ్వలేదు.. పైగా మేము దొంగతనం చేయాలన్న ఉద్దేశ్యంతో దుకాణంలోకి వచ్చామని ఆరోపించాడు. సద్దాం, అతనితోపాటు ఇతర వ్యక్తులు మమ్మల్ని కొట్టడం ప్రారంభించారు. అప్పటికీ మేము అరుస్తూనే ఉన్నాం. కానీ వారు వినిపించుకోలేదు. ఆపై మా బట్టలు విప్పి, గుంజుతూ కొడుతూనే ఉన్నారు. ఆ తరువాత మమ్మల్ని మార్కెట్లోకి తీసుకువచ్చి.. అక్కడ మళ్లీ కొడుతూ, నగ్నంగా మా videoలను కూడా తీశారు. ఈ దారుణాన్ని ఆపేందుకు కానీ, నిందితులను ఆపేందుకు గానీ గుంపులోని ఎవరూ ప్రయత్నించలేదు" అని ఫిర్యాదులో పేర్కొన్నారు.

పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు రైడ్స్ నిర్వహిస్తున్నామని, సద్దాం సహా ఐదుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేసినట్లు ఫైసలాబాద్ పోలీస్ హెడ్ డాక్టర్ అబిద్ ఖాన్ తెలిపారు.

click me!