న్యూ మెక్సికోలో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, పోలీసులకు గాయాలు

By Asianet NewsFirst Published May 16, 2023, 9:03 AM IST
Highlights

న్యూ మెక్సికోలో ఓ దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. అనేక మందికి గాయాలు అయ్యాయి. ఇందులో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. 

వాయవ్య న్యూ మెక్సికో పట్టణంలో సోమవారం (స్థానిక కాలమానం ప్రకారం) కాల్పులు కలకలం రేకెత్తించాయి. ఓ దుండగుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి. అల్బుకెర్కీకి వాయవ్యంగా 290 కిలోమీటర్ల దూరంలో న్యూ మెక్సికోలోని ఫార్మింగ్టన్ నివాస ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో గాయపడిన వారిలో ఇద్దరు పోలీసు అధికారులు కూడా ఉన్నారు.

కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు..

ఈ ఘటనపై పోలీసులు మీడియాతో మాట్లాడుతూ..  కాల్పులకు పాల్పడింది 18 ఏళ్ల దుండగుడు అని, అతడిని చర్చి బయట కాల్చి చంపామని పోలీసులు తెలిపారు. నిందితుడు కాలినడకన పావు మైలు దూరం వెంబడిస్తూ ఈ దారుణానికి ఒడిగట్టాడని ఫార్మింగ్టన్ పోలీసు అధికార ప్రతినిధి షానిస్ గొంజాలెస్ వార్తా సంస్థ ‘రాయిటర్స్’ కు తెలిపారు.  అయితే ఈ కాల్పులకు గల కారణాలు తెలియరాలేదు.

నా సింప్లిసిటీ చూసి ప్రధానికి అత్తనంటే ఎవరు నమ్మలేదు - సుధామూర్తి

ఈ ఘటనలో గాయపడిన ఇద్దరు అధికారుల్లో ఒకరు ఫార్మింగ్టన్ పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన వారు కాగా.. మరొకరు న్యూ మెక్సికో స్టేట్ పోలీస్ కు చెందిన వారు. వీరిద్దరు శాన్ జువాన్ రీజనల్ మెడికల్ సెంటర్ లో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. అయితే గాయపడిన మరో నలుగురు పౌరుల పరిస్థితి తెలియరాలేదు.

సీఎం పదవి ఇవ్వకపోయినా రెబల్ గా మారను, బ్లాక్ మెయిల్ చేయను : కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్

ఈ తుపాకీ హింస వల్ల సుమారు 46,000 మంది నివాసితులు ఉన్న ఫార్మింగ్టన్ నగరంలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో పోలీసు అధికారులు ఆంక్షలను పెట్టారు. కాగా.. ఫార్మింగ్టన్ న్యూ మెక్సికో కొలరాడో, ఉటా, అరిజోనా సరిహద్దులు ఉన్న ప్రదేశానికి ఎంతో దూరంలో లేదు. ఇదిలా ఉండగా.. గత నెలలో గృహహింస కాల్ కు స్పందించే క్రమంలో తప్పుడు చిరునామాకు వెళ్లిన ఓ వ్యక్తిని ఫార్మింగ్ టన్ పోలీసులు కాల్చి చంపారు.

click me!