అమెరికాలోని గురుద్వారాలో కాల్పులు ఇద్దరి పరిస్థితి విషమం..

By SumaBala BukkaFirst Published Mar 27, 2023, 8:53 AM IST
Highlights

ఈ కాల్పుల్లో గాయపడిన బాధితులిద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు,నిందితులు ఒకరికొకరు తెలిసినవారేనని పోలీసులు చెబుతున్నారు. 

అమెరికా : అమెరికాలోని గురుద్వారాలో ఇద్దరు వ్యక్తులు..ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. ఈ ఘటనలో కాల్పులు ద్వేషపూరిత నేరానికి సంబంధించినది కాదని పోలీసులను ఉటంకిస్తూ ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీలోని గురుద్వారాలో ఈ ఘటన చోటుచేసుకుంది. నివేదికల ప్రకారం బాధితులిద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

"కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీలోని గురుద్వారాలో ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. బాధితులిద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కాల్పులు ద్వేషపూరిత నేరానికి సంబంధించినది కాదు, ఇది ఒకరికొకరు తెలిసిన ఇద్దరు వ్యక్తుల మధ్య కాల్పులు" అని శాక్రమెంటో కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది. 

యువతిని కొట్టి చంపిన కన్నతండ్రి.. కరెంట్ షాక్ తో చనిపోయిందని నాటకం.. చివరికి...

సాక్రమెంటో కౌంటీ షెరీఫ్ కార్యాలయ ప్రతినిధి అమర్ గాంధీ మాట్లాడుతూ, కాల్పులకు ముందు ముగ్గురికి మధ్య గొడవ జరిగింది. "మొదటి అనుమానితుడు".. రెండవ అనుమానితుడి స్నేహితుడిని కాల్చాడు. "రెండవ అనుమానితుడు" కాస్త తగ్గాడని... అక్కడి నుంచి పారిపోయే ముందు మొదటి నిందితుడిని కాల్చాడు.

"ఆ గొడవలో పాల్గొన్న వారందరూ ఒకరికొకరు తెలిసినట్లు అనిపించింది. ఇది ఇంతకు ముందు ఉన్న ఘర్షణల నేపథ్యంలో జరిగినట్లుగా అనిపిస్తుంది" అన్నారాయన. ఘటనపై విచారణ కొనసాగుతోంది.యునైటెడ్ స్టేట్స్ లో గత కొన్ని సంవత్సరాలుగా తుపాకీ హింసకు సంబంధించిన సంఘటనలను వరుసగా జరుగుతున్నాయి. 

click me!