ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మరోసారి ఓ ఘటన సంచలనం సృష్టిస్తుంది. చర్చిలో సామూహిక ప్రార్థనలు జరుగుతున్న వేళ ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మరో కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. గత రెండు రోజుల కిత్రం సిడ్నీ మాల్ లోకి కొందరు దుండగులు విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి ఆరుగురి చనిపోయిన ఘటన మరిచిపోకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అది కూడా పవిత్ర చర్చిలో..
పశ్చిమ సిడ్నీలోని వేక్లీ ప్రాంతంలోని క్రైస్ట్ ది గుడ్ షెపర్డ్ చర్చిలో బిషప్ మార్ మారి ఇమ్మాన్యుయేల్ నేత్రుత్వంలో సామూహికంగా ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ సమయంలో నల్లటి దుస్తులు ధరించిన వ్యక్తి బిషప్ (ఫాదర్) వద్దకు వచ్చి అతనిపై విచక్షణరహితంగా కత్తితో దాడి చేశాడు. అక్కడే ఉన్న వారు వెంటనే పూజారిని రక్షించేందుకు ప్రయత్నించారు. ఈ కత్తిపోటు ఘటనలో మరో నలుగురికి గాయాలైనట్లు సమాచారం.
undefined
🚨: Christian preacher Mar Mari Emmanuel has been stabbed in a church in western Sydney, Australia; 4 people have been stabbed in the mass stabbing attack pic.twitter.com/kO680WW0O4
— World Source News 24/7 (@Worldsource24)NCA న్యూస్‌వైర్ నివేదిక ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 7.15 గంటల ప్రాంతంలో న్యూ సౌత్ వేల్స్ అంబులెన్స్ పారామెడిక్స్‌కు ఈ సంఘటన గురించి సమాచారం అందింది. ఈ దాడిలో ఫాదర్ ముఖం , మెడపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఫాదర్ ని వెంటనే లివర్‌పూల్ ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో గాయపడిన నలుగురిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఇతర వ్యక్తులకు ప్రాణాపాయం లేదని వైద్యులు పేర్కొన్నారు. మరోవైపు.. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉంటే.. సిడ్నీలోని ఓ షాపింగ్ మాల్ లో కొంతమంది దుండగులు చొరబడి విచక్షణరహితంగా జనంపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా, 8 మంది గాయపడ్డారు. సిడ్నీలోని వెస్ట్ ఫీల్డ్ షాపింగ్ సెంటర్ లోకి శనివారం మధ్యాహ్నం ఓ దుండగుడు చొరబడ్డాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని దుండగుడిని మట్టుబెట్టారు.