Iran Attack On Israel: భయపడిందే జరిగింది.. ఇజ్రాయెల్‌పై 200 డ్రోన్లతో ఇరాన్ దాడి..  

By Rajesh Karampoori  |  First Published Apr 14, 2024, 11:13 AM IST

Iran Attack On Israel: మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అందరూ ఊహించినట్లుగానే ఇజ్రాయెల్‌పై ఇరాన్ 200 డ్రోన్లు, క్షిపణులతో శనివారం రాత్రి దాడికి పాల్పడింది. ఇరాన్‌ మిత్రదేశాలు సైతం ఇజ్రాయెల్‌ను టార్గెట్ చేస్తున్నాయి.  


Iran Attack On Israel: భయపడింది జరిగింది. ఇరాన్ డమాస్కస్‌లోని ఇరాన్ కాన్సులేట్‌పై వైమానిక దాడి తర్వాత ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరించింది. అందరూ ఊహించినట్లుగానే ఇజ్రాయెల్‌పై ఇరాన్ శనివారం రాత్రి దాడికి పాల్పడింది. ఇరాన్‌ మిత్రదేశాలు సైతం ఇజ్రాయెల్‌ను టార్గెట్ చేస్తున్నాయి. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ డజన్ల కొద్దీ క్షిపణులు, డ్రోన్‌లతో ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ఈ దాడితో యావత్ ప్రపంచం అప్రమత్తమైంది. ఇరాన్ ఈ దాడి ఆపరేషన్‌కు 'ట్రూ ప్రామిస్' అని పేరు పెట్టింది.

 నిజానికి, సిరియాలోని ఇరాన్ కాన్సులేట్‌పై జరిగిన దాడిలో  ఉన్నత స్థాయి ఇరానియన్ జనరల్‌లతో సహా 12 మంది మరణించారు. ఇజ్రాయెల్ దాడికి పాల్పడిందని ఆరోపించింది, అయినప్పటికీ అది అంగీకరించడానికి నిరాకరించింది. ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ బెదిరించింది. ఇరాన్ వీలైనంత త్వరగా దాడి చేయగలదని అమెరికా కూడా చెప్పింది. 

Latest Videos

undefined

ఇజ్రాయెల్ సైన్యం ప్రకారం..  శనివారం-ఆదివారం అర్ధరాత్రి ఇరాన్ 150 క్రూయిజ్ క్షిపణులు , 200 డ్రోన్‌లతో ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ ఎదురుదాడికి భయపడుతోంది. ఏదైనా దేశం తమ గగనతలాన్ని ఇజ్రాయెల్‌పై దాడికి ఇస్తే.. ఇరాన్ దానిని కూడా లక్ష్యంగా చేసుకుంటుందని ఇరాన్ పేర్కొంది. క్షిపణుల కంటే డ్రోన్ల వేగం తక్కువ కాబట్టి.. అందుకే ఇజ్రాయెల్ చేరుకోవడానికి సమయం తీసుకుంటోంది. AFP నివేదిక ప్రకారం.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ప్రయోగించిన ఇరాన్ డ్రోన్‌ను US సైన్యం కూల్చివేస్తోంది. ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డాన్ రక్షణ వ్యవస్థ  చాలా దాడులను విఫలం చేస్తోంది.

ఇజ్రాయెల్ సైన్యం ప్రకారం.. ఇరాన్ శనివారం ఇజ్రాయెల్‌పై తన మొట్టమొదటి ప్రత్యక్ష దాడిలో పేలుడు డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ ప్రయోగించిన భారీ డ్రోన్ దాడికి వ్యతిరేకంగా తమను తాము రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. ఇజ్రాయెల్‌కు వెళ్లే డ్రోన్‌లను ఆ దేశం నిశితంగా పరిశీలిస్తోందని ఆర్మీ అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి తెలిపారు. తాము కూడా  సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు.  


సోర్టీ అప్టేడ్ చేస్తున్నారు. 

click me!