అభిమానుల ఆగ్రహానికి గురవుతున్న పాకిస్థానీ మాజీ క్రికెటర్ అఫ్రిది

First Published Jun 12, 2018, 3:42 PM IST
Highlights

కారణమేంటో తెలుసా?

 వివాదాస్పద పాకిస్థానీ మాజీ క్రికెటర్ షాహిద్ అప్రిది మరో వివాదానికి తెరలేపాడు. అతడు రెండు జంతువులతో కలిసి ట్విట్టర్ లో పెట్టిన ఓ పోటో అభిమానుల ఆగ్రహానికి గురవుతోంది. అతడు ఏ ఉద్దేశ్యంతో ఈ ఫోటో పెట్టాడో అందుకు విరుద్దంగా ప్రవర్తిస్తున్నట్లు ఈ ఫోటోలు కనిపిస్తున్నట్లు సోషల్ మీడియా వేధికగా క్రికెట్ అభిమానులతో పాటు జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల పాకిస్థానీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది తనకు జంతువుల పట్ల  ఉన్న ప్రేమను చాటిచెప్పడానికి ఓ సింహం, జింక తో దిగిన ఫోటో ను ట్విట్టర్ లో పెట్టాడు. వాటితో గడపడం తనకు ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరు ఇలా జంతుప్రేమను కలిగి ఉండాలంటూ పోస్ట్ కూడా పెట్టాడు.

అయితే ఈ ఫోటోలో సింహం గొలుసులతో బంధించబడి ఉంది. దీంతో షాహిద్ అప్రిదిపై విమర్శలు వెలులవెత్తాయి. అడవిలో స్వేచ్చగా ఉండే జంతువులను బంధించి ఇలా గొలుసులతో కట్టేసి హింసించడమేనా జంతు ప్రేమ అంటే? అంటూ పలు వన్యప్రాణి సంరక్షణ సంస్థలు, పెటా వంటి సంస్థలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  ఇలా జంతువులను బంధించి హింసించడం తగదని వాటిని వెంటనే అడవిలో వదిలేయాలని అభిమానులు ఆయనకు సలహా ఇస్తూ రీ ట్వీట్లు చేస్తున్నారు.

click me!