
ఓ పారిశుద్య కార్మికుడికి వింత రోగం వచ్చింది. మురుగునీటి కార్మికుడిగా పనిచేసే ఓ వ్యక్తికి కొత్త రకం ఇన్ఫెక్షన్ వచ్చింది. ఈ ఇన్ ఫెక్షన్ చర్మం పైన కాకుండా... చర్మం కింద వచ్చింది. అతని చర్మం కింద లార్వా( క్రిములు) పాకుతూ స్పష్టంగా కనపడుతూ ఉండటం గమనార్హం. ఈ సంఘటన స్పెయిన్ లో చోటుచేసుకోగా.... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం...64 ఏళ్ల వ్యక్తి కి అరుదైన "హైపర్ ఇన్ఫెక్షన్" సోకింది. మురుగునీటి శుద్ధి కార్మికుడిగా పనిచేసే అతనికి సడెన్ గా విరేచనాలు అవ్వడం మొదలయ్యాయి. అతని చర్మంపై దద్దుర్లు రావడం కూడా మొదలయ్యాయి. దీంతో... వెంటనే ఆస్పత్రికి వెళ్లగా... అతని చర్మం కింద పురుగులు పాకుతూ కనిపించడం విశేషం. అతనికి ఈ ఇన్ఫెక్షన్ ఎలా సోకింది అనే విషయం మాత్రం తెలియలేదు. దీనికి చాలా పర్యావరణ కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇది సాధారణంగా కనిపించే లక్షణం కాదని, వింత రోగం లా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇది ప్రాణాంతక వ్యాధి అని వైద్యులు చెబుతున్నారు.
కానీ అదృష్టవశాత్తూ, వైద్యులు శక్తివంతమైన యాంటీ-పారాసిటిక్ ఔషధాలతో మనిషికి సహాయం చేయగలిగారు. "ఓరల్ ఐవర్‌మెక్టిన్‌తో చికిత్స తర్వాత, రోగి దద్దుర్లు , విరేచనాలు తగ్గాయి అని ఆసుపత్రి ప్రతినిధి చెప్పారు.