అమెరికాలో అగ్ని ప్రమాదం.. ఏడుగురు చిన్నారులతో సహా 13 మంది మృతి.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం..

Published : Jan 06, 2022, 08:10 AM IST
అమెరికాలో అగ్ని ప్రమాదం.. ఏడుగురు చిన్నారులతో సహా 13 మంది మృతి.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం..

సారాంశం

ఫిలడెల్ఫియా పబ్లిక్ హౌసింగ్ అథారిటీకి చెందిన ఈ భవనంలో నాలుగు Smoke detectors ఉన్నాయని, అయితే వాటిలో ఏదీ పనిచేయడం లేదని ఆయన అన్నారు. ప్రమాదాన్ని గుర్తించిన తరువాత ఎనిమిది మంది వ్యక్తులు దీని బారినుంచి తప్పించుకోగలిగారని మర్ఫీ చెప్పుకొచ్చారు. 

న్యూయార్క్ : తూర్పు అమెరికాలోని Philadelphia నగరంలో దారుణం జరిగింది. బుధవారం Three-story buildingలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు సహా 13 మంది మరణించారని అధికారులు తెలిపారు.

ఈ Fire hazardపై ఫిలడెల్ఫియా ఫైర్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ కమిషనర్ క్రెయిగ్ మర్ఫీ మాట్లాడుతూ, మరణాల సంఖ్య "డైనమిక్‌గా ఉంది, ఎందుకంటే లోపల ఇంకా రికవరీ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి" అని అన్నారు. Rescue operation లో భాగంగా 
మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.

అంతేకాదు, తన 35 ఏళ్ల సర్వీసులో తాను చూసిన అత్యంత దారుణమైన అగ్నిప్రమాదం ఇదేనని ఆ అధికారి విచారం వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రమాదానికి కారణాలేమిటో, మంటలు ఎలా చెలరేగాయో ఇప్పుడే చెప్పలేమని.. ఈ విషయం మీద తమ డిపార్ట్‌మెంట్ విచారణ జరుపుతోందని మర్ఫీ చెప్పారు.

ఈ ప్రమాదం మీద ఎలాంటి అనుమానాలూ లేవు. ఇది కావాలని చేసిందనిమేమే అనుకోవడం లేదు. కాకపోతే ఈ ఘటన మీద అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నాం... అని ఆయన విలేకరులతో అన్నారు. ఈ ప్రమాదఘటన మీద అతున్నత స్థాయి పరిశోధన జరిపిస్తాం. దీనికోసం మా వనరులన్నింటినీ ఉపయోగిస్తాం... అని ఆయన తెలిపారు. 

ఫిలడెల్ఫియా పబ్లిక్ హౌసింగ్ అథారిటీకి చెందిన ఈ భవనంలో నాలుగు Smoke detectors ఉన్నాయని, అయితే వాటిలో ఏదీ పనిచేయడం లేదని ఆయన అన్నారు. ప్రమాదాన్ని గుర్తించిన తరువాత ఎనిమిది మంది వ్యక్తులు దీని బారినుంచి తప్పించుకోగలిగారని మర్ఫీ చెప్పుకొచ్చారు. 

'అత్యంత విషాదకరమైన రోజు'

అగ్నిమాపక శాఖ అధికారులు ఉదయం 6:40 గంటలకు (1140 GMT) ఫెయిర్‌మౌంట్ ప్రాంతంలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. "మూడు అంతస్తుల రోహౌస్‌లోని రెండవ అంతస్తు నుండి భారీగా మంటలు వస్తున్నట్లు గమనించారు"

Demographic Crisis In China: చైనాలో జనాభా సంక్షోభం- భారీగా తగ్గిన జననాలు, పెరుగుతున్న వృద్దుల సంఖ్య‌

"N. 23వ సెయింట్‌లోని 800 బ్లాక్‌లో ఈ ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. విషయం తెలిసిన వెంటనే దీనిపై PFD స్పందించింది" అని ఫిలడెల్ఫియా ఫైర్ ఒక ట్వీట్‌లో పేర్కొంది. చెలరేగుతున్న మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి 50 నిమిషాల సమయం పట్టిందని తెలిపింది. 

ఫిలడెల్ఫియా మేయర్ జిమ్ కెన్నీ విలేఖరులతో మాట్లాడుతూ, "నిస్సందేహంగా ఇది ఫిలడెల్ఫియా నగర చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజులలో ఒకటి. అత్యంత విషాదకరమైన రీతిలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం విచారకరం’ అని తన దిగ్భ్రాంతిని తెలిపారు. 

ఫిలడెల్ఫియా ఎంక్వైరర్ ప్రమాదానికి గల కారణాల అన్వేషణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మూడంతస్తుల ఇంటిని రెండు అపార్ట్‌మెంట్లుగా మార్చారని పోలీసులు తెలిపారు. భవనంలో మొత్తం దాదాపు 26 మంది నివసిస్తున్నారు. మొదటి అంతస్తులో ఎనిమిది మంది,  రెండు, మూడు అంతస్తులలో 18 మంది నివసిస్తున్నారు.

అయితే, మంటలు చెలరేగిన సమయంలో భవనంలో ఎంతమంది ఉన్నారనేది స్పష్టంగా తెలియరాలేదు. ‘ఇది చాలా విషాదకరమైన ఘటన, దీనిమీద అందరం విచారం వ్యక్తం చేస్తున్నాం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ప్రమాదం సమయంలో బిల్డింగ్ లో ఎంత మంది ఉన్నారనేది ఇప్పుడే చెప్పలేం’ అని మేయర్ అన్నారు. 

ఈ ఘటనను కవర్ చేసిన స్థానిక మీడియాకు ఇరుగుపొరుగు వారు తాము మంటలు చెలరేగిన తరువాత విషయం గమనించామని తెలిపారు. ప్రమాదం జరిగిన భవనానికి సమీపంలో ఉండే బిల్ రిచర్డ్స్ అనే వ్యక్తి ఉదయం 7:00 గంటలకు ముందు "ఓ మై గాడ్, ఓ మై గాడ్" అని ఒక మహిళ అరుపులు విన్నట్లు విచారణలో తెలిపారు. వెంటనే ఏం జరిగిందా అని తాను బైటికివచ్చి చూశాను... ఆ ప్రమాదం నన్ను కలవరపరిచింది’’ అని చెప్పాడు.
 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !