Demographic Crisis In China: చైనాలో జనాభా సంక్షోభం- భారీగా తగ్గిన జననాలు, పెరుగుతున్న వృద్దుల సంఖ్య‌

By Rajesh KFirst Published Jan 6, 2022, 4:49 AM IST
Highlights

Demographic crisis in China: చైనాను జనాభా సంక్షోభం వెంటాడుతోంది. 2020 జనాభా లెక్కల ప్రకారం సుమారు 10 ప్రావిన్స్​ల్లో జననాల రేటు ఒక్కశాతం కంటే తక్కువగా నమోదు అయ్యింది. జననాల రేటును పెంచేందుకు ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చేందుకు చట్టసవరణలు చేసినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగింది. 60 ఏళ్లు పైబడిన జనాభా  264 బిలియన్లకు పెరిగింది. అంటే.  వృధ్దుల జ‌నాబా 18.7 శాతం పెరిగింది.
 

Demographic Crisis In China: చైనాను జనాభా సంక్షోభం వెంటాడుతోంది. చైనాలో ఎన్నాడులేని విధంగా జ‌నాభా మరింత త‌గ్గింది. 2020లో ఆ దేశంలోని 10 ప్రావిన్స్​ల్లో జననాల రేటు ఒక శాతం కంటే తక్కువకు ప‌డిపోయింది. చైనాలో జననాల రేటు ఆందోళనకర స్థాయికి చేరుకుంది. ఈ నేప‌థ్యంలో ఒకటి కంటే ఎక్కువ మంది పిల్లలను కనేలా చైనా ప్ర‌భుత్వం ప్రోత్సహించినా.. అనుకున్న స్థాయిలో ఫ‌లితాలు రాలేదని గ‌ణాంకాలు స్ప‌ష్టం చేస్తోన్నాయి. జనాభా సంక్షోభం మరింత తీవ్రమవుతున్నట్లు పరిస్థితి సూచిస్తుంది. దశాబ్దాల నాటి ఒకే బిడ్డ విధానం వల్ల ఏర్పడిన జనాభా సంక్షోభాన్ని పరిష్కరించడానికి చైనా గత ఏడాది ఆగస్టులో ముగ్గురు పిల్లల విధానాన్ని పెద్ద విధాన మార్పుగా ఆమోదించింది.

దేశంలో జననాల రేటు భారీగా తగ్గిన నేపథ్యంలో జనాభా, కుటుంబ నియంత్రణ చట్టానికి సవరణ చేసి చైనా ప్రభుత్వం ముగ్గురు పిల్లల విధానాన్ని తీసుకొచ్చింది. తల్లిదండ్రులపై భారం పడకుండా వారికి మద్దతుగా నిలిచేలా చట్టానికి మార్పులు చేసింది. ఈ క్ర‌మంలో చైనా 2016లో ఒక బిడ్డ విధానాన్ని రద్దు చేసి, అన్ని జంటలకు ఇద్దరు పిల్లలను కలిగి ఉండటానికి వీలు కల్పిస్తూ ప్రభుత్వం అనుమతించింది.  ఈ క్రమంలోనే 'ఒకే శిశువు' విధానాన్ని రద్దు చేసింది. దీంతో పదేళ్లకు ఓసారి జరిగే జనాభా గణనలో చైనా జనాభా 140 కోట్లకు పెరిగింది. అయితే..  60 ఏళ్లు పైబడిన జనాభా  264 బిలియన్లకు పెరిగింది. అంటే.. వృధ్దుల జ‌నాబా 18.7 శాతం పెరిగింది. దీంతో జనాభా సంక్షోభం మరింత తీవ్రమవుతుందని జనగ‌ణ‌న నివేదిక‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ముగ్గురు పిల్లలకు అనుమతించేలా చట్టాన్ని సవరించింది. 

Read Also:   కేసీఆర్‌ నీ గొయ్యి.. నువ్వే తవ్వుకుంటున్నావ్, కేంద్రంలో మేమూ పవర్‌లో వున్నాం: బండి సంజయ్

ముగ్గురు పిల్లల విధానాన్ని ఆమోదించిన తర్వాత చైనాలోని 20 కంటే ఎక్కువ ప్రాంతాల్లో కొన్ని మార్పులు వచ్చాయి. దంపతులకు ప్రసూతి, వివాహ, పితృత్వ సెలవులను పెంచడం వంటి చ‌ర్య‌ల‌ను చేప‌ట్టింది  చైనా ప్ర‌భుత్వం. అయితే.. స్టాటిస్టికల్ ఇయర్‌బుక్ 2020 ప్రకారం  దేశంలోని 10 ప్రాంతాల్లో ఒక శాతం కంటే తక్కువగా నమోదు కావడం ప్రభుత్వాన్ని ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. చైనాలో అత్యధిక జనాభా కలిగిన ప్రావిన్సులలో ఒకటైన హెనాన్​లో 1978 తర్వాత మొదటిసారిగా జననాలు సంఖ్య 10 లక్షల కంటే తక్కువకు పడిపోయాయి. 

Read Also:   పీఆర్సీపై వీడని సస్పెన్షన్.. ముగిసిన జగన్ సమీక్ష, రేపు ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ

నా స్టాటిస్టికల్ ఇయర్‌బుక్ 2021' ప్రకారం, 2020లో చైనా జనన రేటు ప్రతి 1,000 మందికి 8.52గా నమోదైంది, ఇది 43 ఏళ్లలో అతి తక్కువ. జనాభా యొక్క సహజ వృద్ధి రేటు 1,000 మందికి 1.45 గా ఉంది.  1978 నుండి ఇంత కనిష్ట స్థాయి చేరుకోవ‌డం ఇదే తొలిసారి అని పేర్కొంది. 2020 సంవత్సరానికి జనన రేటును ప్రచురించే 14 ప్రాంతీయ-స్థాయి ప్రాంతాలలో ఏడు, జాతీయ సగటు కంటే అధిక జనన రేటును నమోదు చేశాయి. ఈ ప్రావిన్సులలో నైరుతి గుయిజౌ ప్రావిన్స్ మరియు గ్వాంగ్జీ జువాంగ్ అటానమస్ రీజియన్ కూడా ఉన్నాయి.
 
Read Also:   ప్రధాని మోడీ పర్యటన రద్దుపై పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నదంటే..?

 జననాల రేటుపై కోవిడ్ ప్రభావం!

చైనాలోని తూర్పు జియాంగ్సు ప్రావిన్స్ వంటి కొన్ని అభివృద్ధి చెందిన ప్రాంతాలలో, జనన రేటు జాతీయ స్థాయి కంటే తక్కువగా ఉంది. జాతీయ జనన రేటు 1,000 మందికి 6.66 ఉంది. బీజింగ్ లో 1,000 మందికి జనన రేటు 6.98 గా ఉంది. అలాగే  టియాంజిన్‌లలో ప్రతి 1,000 మందికి జనన రేటు 5.99 న‌మోద‌య్యింది. చైనాలోని రెన్మిన్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ పాపులేషన్ అండ్ డెవలప్‌మెంట్ స్టడీస్‌కు చెందిన సాంగ్ జియాన్ మాట్లాడుతూ, జనన రేటుపై  కోవిడ్ -19 కూడా  భావితం చేసే కారకాల్లో  ఒకటని అన్నారు. చైనా ప్ర‌ధానంగా వృద్ధాప్య జనాభా,  ప్రజల ప్రాధాన్యతలను మార్చడం వంటి అనేక సవాళ్లను చైనా ఎదుర్కొంటోంది. అనేక కారణాల వల్ల తక్కువ జనన రేటు కొనసాగుతుంది.

click me!