Serbia School Shooting: తండ్రి తుపాకీని దొంగిలించి.. తోటి విద్యార్థులపై కాల్పులు.. తొమ్మిది మంది హతం..

By Rajesh KarampooriFirst Published May 3, 2023, 5:59 PM IST
Highlights

Serbia School Shooting: ఆగ్నేయ యూరప్ లోని సెర్బియాలో ఘోరమైన కాల్పులు జరిగాయి. ఓ పాఠశాలలో విద్యార్థి జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది మరణించారు. మృతుల్లో ఎనిమిది మంది విద్యార్థులు, ఒక సెక్యూరిటీ గార్డు కూడా ఉన్నట్లు సమాచారం. వీరితో పాటు పలువురు గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించారు.

Serbia School Shooting: సెర్బియాలో కాల్పుల కలకలం చెలారేగింది. రాజధాని బెల్‌గ్రేడ్‌లోని పాఠశాలలో ఓ బాలుడు కాల్పులు జరపడంతో ఎనిమిది మంది చిన్నారులు సహా తొమ్మిది మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ మేరకు సెర్బియా పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రకటన ప్రకారం, వ్లాడిస్లావ్ రిబ్నికర్ ప్రాథమిక పాఠశాలలో  బుధవారం ఉదయం 8:40 గంటలకు కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. వాంగ్మూలం ప్రకారం.. నిందితుడు .. అదే పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నారు. ఆ మైనర్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

 
నిందితుడు తన తండ్రి తుపాకీని దొంగిలించి.. తన తోటి విద్యార్థులు,పాఠశాల గార్డుపై అనేక కాల్పులు జరిపాడని అధికారులు తెలిపారు. సెర్బియా మీడియా కథనాల ప్రకారం.. ఈ కాల్పుల్లో  తొమ్మిది మంది మరణించారు. మృతుల్లో ఎనిమిది మంది విద్యార్థులు, ఒక సెక్యూరిటీ గార్డు కూడా ఉన్నట్లు సమాచారం. వీరితో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని రక్షించి, వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిగినట్లు గుర్తించిన వెంటనే పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేయడం ప్రారంభించాయని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 

ఈ దాడిలో మృతుల్లో ఎనిమిది మంది విద్యార్థులు, ఒక సెక్యూరిటీ గార్డు మరణించారనీ,  ఆరుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు గాయపడ్డారని, వారిని చికిత్స నిమిత్తం తరలించినట్లు తెలిపారు. స్థానిక మీడియా ఛానెల్‌లలో ఈ ఘటనకు సంబంధించిన ఫుటేజీలు ప్రారంభమవుతున్నాయి. ఇందులో పాఠశాల వెలుపల ఆందోళన చెందుతున్న తల్లిదండ్రుల గుంపును చూపిస్తున్నారు.  

అదే సమయంలో పోలీసులు నిందితుడిని పట్టుకుని రోడ్డుపై పార్క్ చేసిన పోలీసు వాహనం వైపు తీసుకెళ్లడం కనిపించింది. వ్లాడిస్లావ్ రిబ్నికర్ ప్రాథమిక పాఠశాల సెంట్రల్ బెల్‌గ్రేడ్‌లోని ఒక ప్రసిద్ధ పాఠశాల. కాల్పుల ఘటన తర్వాత ఈ పాఠశాల పరిసర ప్రాంతాలను పోలీసులు సీల్ చేశారు. సెర్బియాలో జరిగిన ఈ ఘోరమైన కాల్పుల ఘటన దిగ్భ్రాంతికరం ఎందుకంటే ఈ శతాబ్దంలో ఇంత పెద్ద ఎత్తున హింస ఎప్పుడూ జరగలేదు. అయితే, వ్లాడిస్లావ్ రిబ్నికర్ పాఠశాల చుట్టూ ఉన్న బ్లాక్‌ను పోలీసులు మూసివేశారు.ఇక్కడ పట్టణ ప్రాంత జనాభా 12 లక్షలు కాగా, మొత్తం జనాభా 17 లక్షలు. ఇది ప్రశాంతమైన, అందమైన నగరాలలో ఒకటి.

click me!