ఆ విషయంలో మహిళలకు అనుమతి.. సౌదీ సంచలన నిర్ణయం..

By AN TeluguFirst Published Jun 10, 2021, 9:39 AM IST
Highlights

గల్ఫ్ దేశం సౌదీ అరేబియా తాజాగా మహిళల విషయంలో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళలు మగతోడు లేకుండా ఒంటరిగా జీవించేందుకు అనుమతించింది. ఒంటరి, విడాకులు తీసుకున్న, భర్త చనిపోయిన మహిళలు ఇక మీదట వారి తండ్రి లేదా ఇతర మగ సంరక్షకుడి అనుమతి లేకుండానే వారు తమ సొంత ఇళ్లలో ఒంటరిగా జీవించవచ్చు. 

ఒంటరి మహిళలు మగతోడు లేకుండానే వేరే ఇంట్లో ఉండొచ్చనేది తాజగా తీసుకువచ్చిన ఈ కొత్త నిబంధన ముఖ్య ఉద్దేశం. ఈ మేరకు సౌదీ ఇటీవల ఒక చట్టపడరమైన సవరణను ప్రవేశపెట్టింది. ఈ సవరణ ప్రకారం ఒక వయోజన, భర్త నుంచి విడిపోయిన మహిళ తన తండ్రి లేదా మగ సంరక్షకుడి అనుమతి లేకుండా వేరే ఇంట్లో ఒంటరిగా నివసించడానికి వీలు కల్పిస్తుంది. 

click me!