28మంది భార్యల సమక్షంలో 37వ సారి పెళ్లి..!

Published : Jun 10, 2021, 08:32 AM IST
28మంది భార్యల సమక్షంలో 37వ సారి పెళ్లి..!

సారాంశం

దుబాయిలో ఇప్పటికీ ఓ వ్యక్తి ఏకంగా 37 పెళ్లిళ్లు చేసుకున్నాడు.  అది కూడా 28మంది భార్యల మధ్యలో వారిని పెళ్లి చేసుకోవడం గమనార్హం. 

బహుభార్యతత్వం... ఈ మాట రాజ కుటుంబీలు ఎక్కువగా పాటించేవారు. ఎంత మందిని కావాలంటే అంత మందిని పెళ్లి చేసుకునే హక్కు వారికి ఉండేది.  ఎంతమందిని చేసుకున్నా.. కనీసం ఎవరూ ప్రశ్నించేవారు కాదు. కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఇప్పుడు ఎవరైనా అలా పెళ్లి చేసుకుంటే.. ఎవరూ ఊరుకోరు. 

అయితే.. దుబాయిలో ఇప్పటికీ ఓ వ్యక్తి ఏకంగా 37 పెళ్లిళ్లు చేసుకున్నాడు.  అది కూడా 28మంది భార్యల మధ్యలో వారిని పెళ్లి చేసుకోవడం గమనార్హం. 

ఈ వివాహ కార్యక్రమంలో అతడి 135 మంది పిల్లలు, 126 మనవళ్లు, మనవరాళ్లు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన 45 సెకన్ల నిడివి కలిగిన ఓ వీడియోను ఐపీఎస్‌ అధికారి రూపిన్‌ శర్మ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు.

 

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఒక్క పెళ్లాంతోనే వేగలేకపోతున్నాం.. ఇంత మందిని ఎలా భరిస్తున్నావు స్వామీ అంటూ కొందరు కామెంట్స్ పెట్టడం గమనార్హం. అసలు అంతమందిని ఆయనను పెళ్లి చేసుకోవడానికి ఎలా అంగీకరించారంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

ఈ భార‌తీయుడు లేకపోయుంటే ఎంత దారుణం జ‌రిగేదో.. 26/11 త‌ర‌హా దాడి త‌ప్పిందా.?
10 నిమిషాల్లో 1.5 లీట‌ర్ల‌ కూల్‌డ్రింక్‌ తాగిన యువ‌కుడు.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలిస్తే మైండ్ బ్లాంక్‌