93 మందిని చంపిన సీరియల్ కిల్లర్ శామ్యూల్: జైల్లోనే మృతి

By narsimha lodeFirst Published Dec 31, 2020, 11:47 AM IST
Highlights

93 మందిని హత్య చేసిన సీరియల్ కిల్లర్ శామ్యూల్ లిటిల్ బుధవారంనాడు మరణించాడు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆయన చనిపోయాడు. ఆయన వయస్సు 80 ఏళ్లు. 

వాషింగ్టన్: 93 మందిని హత్య చేసిన సీరియల్ కిల్లర్ శామ్యూల్ లిటిల్ బుధవారంనాడు మరణించాడు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆయన చనిపోయాడు. ఆయన వయస్సు 80 ఏళ్లు. 

బుధవారం నాడు తెల్లవారుజామున ఆయన మరణించినట్టుగా అధికారులు తెలిపారు. ఆయన మరణానికి కారణాలను ఇంకా ధృవీకరించాల్సి ఉందని కాలిఫోర్నియా డిపార్ట్ మెంట్ ఆఫ్ ది కరెక్షన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

1970 నుండి 2005 మధ్య కాలంలో ఆయన ఈ హత్యలు చేశాడు. శామ్యూల్ చేతిలో హత్యకు గురైనవారిలో ఎక్కువ మంది మహిళలే కావవడం గమనార్హం. 

మాజీ బాక్సర్ బాధితులు ఎక్కువగా డ్రగ్స్ బానిసలు, వేశ్యలు. మహిళలేనని పోలీసులు చెప్పారు. మరణించినవారిలో ఎక్కువగా గుర్తించలేదని పోలీసులు తెలిపారు.

2014లో జైలు శిక్ష అనుభవించిన తర్వాత పెరోల్ లేకుండా వరుసగా ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు.

శామ్యూల్ మెక్ డోవెల్ అని కూడ ఆయనను పిలిచేవారు. లిటిల్ 6 అడుగుల ఎత్తులో ఉంటాడు. గొంతు కోసే ముందు శక్తివంతమైన పిడిగుద్దులతో ఆయన ప్రత్యర్ధులపై దాడి చేస్తాడని పోలీసులు తెలిపారు.

1940, జూన్ 7న శామ్యూల్ లిటిల్ జన్మించాడు. టీనేజర్ అయిన తల్లి పసివాడుగా ఉన్న సమయంలోనే బంధువల ఇంటిలో అతడిని వదిలేసింది.  దీంతో బాల్యంలోనే ఆయన చెడు అలవాట్ల వైపు సాగాడు.

ఐదో తరగతిలో ఉన్న సమయంలో టీచర్ తన గొంతును నొక్కిపెట్టిన సమయంలో ఎవరి మెడను చూసిన సమయంలో గట్టిగా నొక్కి చంపాలని భావించేవాడని  పోలీసుల విచారణలో చెప్పాడు.

తన సహచర విద్యార్ధిని చంపేందుకు శామ్యూల్ ప్రయత్నించి విఫలమయ్యాడు. పదమూడేళ్ల వయస్సులో దొంగతనం చేసి పోలీసులకు ఆయన చేతికి చిక్కాడు.

1956 లో అతనిపై తొలి కేసు నమోదైంది. దుకాణాల అపహరణ, మోసం, మాదకద్రవ్యాల కేసులు ఆయనపై ఉన్నాయి. 1980లో మిస్సిస్సిప్పి, ఫ్లోరిడాలో మహిళలను హత్య చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. కాని దోషిగా నిర్ధారణ కాలేదు.

హత్య చేయడం మృతుల ఒంటిపై ఉన్న బంగారం వంటి వస్తువులను లాక్కోవడం శవాలను పొదల్లో పారేసేవాడు. హత్య ప్రదేశంలో పోలీసులకు ఎలాంటి ఆనవాళ్లు లభ్యం కాకుండా జాగ్రత్తలు తీసుకొనేవాడు.

2014లో ఓ హత్య కేసులో లభ్యమైన ఆధారాలతో శామ్యూల్ ను అరెస్ట్ చేశారు. డీఎన్ఏ టెక్నాలజీని ఉపయోగించి ఆయన చేసిన నేరాలను రుజువు చేశారు పోలీసులు.
 

click me!