కరోనా వైరస్ ఆడదా..? బాధితులు ఎక్కువ మంది పురుషులే..!

By telugu news teamFirst Published Dec 31, 2020, 11:40 AM IST
Highlights

 కరోనా వైరస్ బారినపడి 17 లక్షల 80 వేలమంది మృత్యువాత పడ్డారు. మొత్తం 8కోట్ల 17 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. ఇప్పటి వరకు 46లక్షల 20వేల మంది కోలుకున్నారు.
 

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేసింది. ఈ వైరస్ కారణంగా 2020 మొత్తం వృథా అయ్యిందనే చెప్పాలి. ఇప్పుడిప్పుడు దీనిని నుంచి ప్రజలు కోలుకుంటున్నారనుకున్న నేపథ్యంలో.. స్టైయిన్ మరో మహమ్మారి ఎటాక్ చేయడం మొదలుపెట్టింది. ఈ విషయాలన్నీ మనకు తెలిసినవే కాగా.. ఈ వైరస్ గురించి కొత్త వాదన ఒకటి పుట్టుకొచ్చింది.

కరోనా మహమ్మారి ఆడదని.. అందుకే ఎక్కువగా పురుషులపై ఎటాక్ చేస్తోందని చెప్పడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారినపడి 17 లక్షల 80 వేలమంది మృత్యువాత పడ్డారు. మొత్తం 8కోట్ల 17 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. ఇప్పటి వరకు 46లక్షల 20వేల మంది కోలుకున్నారు.

భారత దేశంలో కోటి 2లక్షల మంది కరోనా బారిన పడ్డారు. ఇక లక్షా 47వేల మంది మృత్యువాత పడ్డారు. అయితే కరోనా వైరస్ భారత్‌లో మహిళలకంటే పురుషులకే ఎక్కువగా సోకింది. ఈ విషయం కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ లెక్కలు చెబుతున్నాయి. లక్షా 47వేల మంది మృతుల్లో 70 శాతం మంది పురుషులేనని కేంద్రం స్పష్టం చేసింది. కరోనాతో మృతి చెందిన పురుషుల్లో కూడా 60 ఏళ్ల లోపువారు 45 శాతం మంది ఉన్నారు. ఇక మొత్తం కరోనా కేసుల్లో 63 శాతం మంది పురుషులే ఉన్నారు. వారిలో 52 శాతం 18 నుంచి 44 ఏళ్ల వయసు లోపువారు ఉన్నారు. మిగిలిన 11 శాతం పురుషులే మృత్యువాత పడుతున్నారు.
 

click me!