
Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే రష్యా సైనిక బలగాలు చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లోని కొత్త ప్రయోగశాలపై బాంబుల వర్షం కురిపించాయి. దీంతో ఆ ల్యాబ్ పూర్తిగా ధ్వంసం అయింది. అలాగే, చెర్నోబిల్ పరిసర ప్రాంతాల్లో రేడియేషన్ ను గుర్తించే మానిటర్లు పనిచేయడం అగిపోయింది. న్యూక్లియర్ ప్లాంట్ సహా ఇతర విషయాలతోపాటు, రేడియోధార్మిక వ్యర్థాల నిర్వహణను మెరుగుపరిచేందుకు ఈ ల్యాబ్ పనిచేస్తుందని చెర్నోబిల్ మినహాయింపు జోన్‌కు బాధ్యత వహించే ఉక్రేనియన్ స్టేట్ ఏజెన్సీ వెల్లడించింది.
యుద్ధం ప్రారంభంలో రష్యా సైన్యం డికమిషన్డ్ ప్లాంట్‌ను స్వాధీనం చేసుకుంది. మినహాయింపు జోన్ అనేది ప్లాంట్ చుట్టూ ఉన్న కలుషితమైన ప్రాంతం. 1986లో ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన అణు విధ్వంసం జరిగిన ప్రదేశం ఈ చెర్నోబిల్. కాగా, యూరోపియన్ కమిషన్ మద్దతుతో 6 మిలియన్ యూరోల వ్యయంతో నిర్మించిన ప్రయోగశాల 2015లో ప్రారంభించబడిందని రాష్ట్ర ఏజెన్సీ తెలిపింది.
ప్రయోగశాలలో అత్యంత చురుకైన నమూనాలు మరియు రేడియోన్యూక్లైడ్‌ల నమూనాలు ఉన్నాయి. అవి ఇప్పుడు శత్రువుల చేతిలో ఉన్నాయి, అవి నాగరిక ప్రపంచానికి కాకుండా దానికే హాని కలిగిస్తాయని మేము ఆశిస్తున్నాము అని ఏజెన్సీ తన ప్రకటనలో తెలిపింది. మరో ఆందోళనకరమైన పరిణామంలో, ప్లాంట్ చుట్టూ ఉన్న రేడియేషన్ మానిటర్లు పనిచేయడం మానేశాయని ఉక్రెయిన్ న్యూక్లియర్ రెగ్యులేటరీ ఏజెన్సీ తెలిపింది.
కాగా, ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతోంది. రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం మొదలై దాదాపు నెల రోజులు అవుతోంది. పుతిన్ ఆదేశాలతో మరింత దూకుడుగా ముందుకుసాగుతూ.. విధ్వంసం సృష్టిస్తున్నాయి. రష్యా మరింత దూకుడుగా ప్రదర్శిస్తుండటంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే శాంతియుతంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని చాలా దేశాలు కోరుతున్నాయి. అయినప్పటికీ రష్యా ఏమాత్రం పట్టించుకోకుండా దూకుడుగా ముందుకు సాగుతూ.. ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే పలు మార్లు ఆ దేశ నేతలు అణుబాంబు దాడులు గురించి ప్రస్తావించడం ఉక్రెయిన్ తో పాటు యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ పై అనేక దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. రష్యా సైతం వెనక్కి తగ్గకుండా చర్యలు తీసుకుంటూ... తనపై ఆంక్షలు విధించిన దేశాలపై రష్యాలో కార్యకలాపాలు నిర్వహణపై ఆంక్షలు విధిస్తోంది.
తీవ్రప్రాంత నగరమైన మారియుపోల్ పై రష్యా బలగాలు బాంబుల మోత మోగిస్తున్నాయి. దీంతో నగరం శిథిళనగరంగా మారుతోంది.