లేడీ డిటెక్టివ్.. నిందితుడిపై నిఘా పెట్టమంటే లవ్ లో పడింది.. కొంపమునిగింది....

By AN TeluguFirst Published Aug 21, 2021, 10:02 AM IST
Highlights

తాను వెంటాడాల్సిన నిందితుడితోనే  ఓ రష్యన్ డిటెక్టివ్ ప్రేమలో పడింది.  అతడితో బంధం పెంచుకుంది. ఉద్యోగ ధర్మాన్ని గాలికొదిలి అతనితో చెట్టాపట్టాలేసుకుని తిరగసాగింది.  విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెకు షాక్ ఇచ్చారు. ఆమెపై క్రిమినల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  

ప్రేమ ఎప్పుడు, ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరు.  రెండు మనసులు ఒకటి కావడానికి పెద్దగా కారణాలేవి అక్కర్లేదు. ఇది ఇప్పటి మాట కాదు.. చరిత్ర చెబుతున్న సత్యం.  అయితే విధి నిర్వహణలో మర్చిపోయి... నిధులతోనే ప్రేమలో మునిగి తేలితే ఎక్కడలేని తిప్పలు వచ్చిపడతాయి. అచ్చం సినిమాల్లో చూపించినట్లుగానే నిందితుడితో ప్రేమలో పడిందో డిటెక్టివ్. అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది.. చివరికి చిక్కుల్లో పడింది.  

తాజాగా ఓ రష్యన్ డిటెక్టివ్ ఇలాంటి పరిస్థితి ఎదురైంది.  తాను వెంటాడాల్సిన నిందితుడితోనే ప్రేమలో పడింది.  అతడితో బంధం పెంచుకుంది. ఉద్యోగ ధర్మాన్ని గాలికొదిలి అతనితో చెట్టాపట్టాలేసుకుని తిరగసాగింది.  విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెకు షాక్ ఇచ్చారు. ఆమెపై క్రిమినల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  

మదీనా సుకెనోవా..  24 ఏళ్ల రష్యన్ స్పై ఏజెంట్.  ఈ మధ్యనే తన చదువు పూర్తి చేసుకుని ప్రొఫెషనల్ గా చేరింది.  మొదటి కేసు గా మిఖాయిల్ సెర్బిన్ అనే వ్యక్తి పై ఆమె నిఘా పెట్టాల్సి ఉంది. మిఖాయెల్ తన బ్యాంకు ఖాతాలో డబ్బులు కాజేశాడని,  అతనిపై నిఘా పెట్టి అసలు విషయం రాబట్టాలని ఆమె క్లైంట్ ఆమెను నియమించాడు. 

కానీ మదీనా అతడితో చనువు పెంచుకుని ప్రేమలో పడింది. అతడికి తన ప్రేమకు గుర్తుగా ఓ కారును కూడా బహుకరించింది.  ఒకరోజు సెర్బిన్ అదే కారులో తన ప్రేయసి మదీనా ఇంటికి వెళుతుండటంతో వీరి ప్రేమాయణం బయటపడింది.

ఈ ప్రేమాయణం గురించి ఆమె  తన ఉన్నతాధికారులకు చెప్పకపోవడంతో ఆమెపై కూడా అధికారులు క్రిమినల్ సెక్షన్ల కింద దర్యాప్తు ప్రారంభించారు. ఉద్యోగ ధర్మాన్ని పక్కనపెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడటం కాకుండా...ఓ నిందితుడికి సాయం చేయడం వల్లనే ఆమెపై కూడా ఇప్పుడు నేర విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. అయితే ఈ మధ్యనే పోలీసులు ఈ కేసు నుంచి తనను తప్పించాలని కూడా కోరిందట. కానీ ప్రేమ వ్యవహారం గురించి మాత్రం చెప్పలేదట. 

click me!