ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల అరాచకం: జర్మనీ జాతీయుడి కాల్చివేత

By narsimha lodeFirst Published Aug 20, 2021, 6:38 PM IST
Highlights


ఆఫ్ఘనిస్తాన్ లో జర్మన్ జాతీయుడిని తాలిబన్లు కాల్చి చంపారు. ఈ ఘటనలో మరొకరు కూడ గాయపడ్డారు. ఓ జర్నలిస్టు కుటుంబానికి చెందిన బంధువును లక్ష్యంగా చేసుకొని తాలిబన్లు కాల్పులు జరిపారు. 


కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల అరాచకం కొనసాగుతోంది. శుక్రవారం నాడు కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద ఓ జర్మన్ జాతీయుడిని తాలిబన్లు కాల్చి చంపారు.  ఆఫ్ఘనిస్తాన్ నుండి వెళ్లే వారిని టార్గెట్ చేసిన తాలిబన్లు వారిపై కాల్పులు జరిపారు. ఆదివారం నుండి ఇప్పటివరకు సుమారు 18 వేల మంది  ఆఫ్ఘనిస్తాన్ నుండి  వెళ్లిపోయారని నాటో అధికారులు తెలిపారు.

తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ లో అధికారాన్ని హస్తగతం చేసుకొన్న తర్వాత  స్థానికంగా నివాసం ఉండేందుకు భయపడుతున్న వారంతా దేశాన్ని వదిలేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు కాబూల్ ఎయిర్ పోర్టును మార్గంగా ఎంచుకొన్నారు.

అమెరికాకు ఎవరెవరు సహకరించారనే విషయమై తాలిబన్లు ఆరా తీస్తున్నారు.  ఓ జర్నలిస్టు బంధువు తాలిబన్ల కాల్పుల్లో మరణించినట్టుగా స్థానిక మీడియా ప్రకటించింది. ఈ ఘటనలో మరొకరు కూడ తీవ్రంగా గాయపడ్డారని  సమాచారం.  ముగ్గురు డిడబ్ల్యు జర్నలిస్టుల ఇళ్లను తాలిబన్లు  శోధించారని స్థానిక మీడియా తెలిపింది.

also read:భారత ఎంబసీల్లో తాలిబాన్ల సోదాలు.. ఎత్తుకెళ్లిన వాహనాలు

కాబూల్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడేందుకు సిద్దమైన తరుణంలో జర్మన్ కి చెందిన ప్రసార మాధ్యమాలు తమ ఆప్ఘన్ సిబ్బందిని జర్మనీకి తరలించేందుకు సహాయ పడాలని  జర్మన్ దేశాన్ని కోరాయి.

ఆప్ఘన్ లో ఉన్న జర్మన్ కు చెందిన వార్తా పత్రికల్లో పనిచేస్తున్న సిబ్బంది, జర్నలిస్టులను త్వరగా జర్మన్ కు రప్పించాలని జర్మన్ ఛాన్సిలర్ ఎంజెలా మెర్కెల్, విదేశాంగ మంత్రి హికో మాస్ కు లేఖ రాశారు. తమ ఉద్యోగులు జర్మనీకి వలస వెళ్లేందుకు వీలుగా అత్యవసర వీసాలను ఇవ్వాలని కూడా కోరారు.

click me!