Russia-Ukraine War: దూకుడు పెంచిన ర‌ష్యా.. లివివ్‌పై మిస్సైళ్ల దాడి !

Published : Apr 18, 2022, 01:32 PM IST
Russia-Ukraine War:  దూకుడు పెంచిన ర‌ష్యా.. లివివ్‌పై మిస్సైళ్ల దాడి !

సారాంశం

Russia-Ukraine War: ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి కొన‌సాగుతూనే ఉంది. దూకుడు పెంచిన ర‌ష్యా బ‌ల‌గాలు ఉక్రెయిన్ లోని ప‌లు న‌గ‌రాల మీద మిస్సైళ్ల వ‌ర్షం కురిపిస్తున్నాయి. దీంతో అక్క‌డి ప్రాంతాలు శిథిలాల‌ను త‌ల‌పిస్తున్నాయి.   

Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడులు కొన‌సాగుతున్నాయి. యుద్ధం ప్రారంభం అయి రెండు నెలలు కావస్తున్నప్పటికీ.. ఉక్రెయిన్ బ‌ల‌గాలు ర‌ష్యాకు ధీటైన స‌మాధాన‌మిస్తున్నాయి. దీంతో పుతిన్ ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకున్న‌ట్టు తెలుస్తోంది. ఆ దేశ బ‌ల‌గాల‌కు గ‌ట్టి వార్నింగ్ ఇవ్వ‌డంతో.. రష్యా బ‌ల‌గాలు దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. ఉక్రెయిన్ లోని అనేక న‌గ‌రాల‌పై క్షిప‌ణుల‌తో విరుచుకుప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలోనే లివివ్ న‌గ‌రంపై వ‌రుస‌ మిస్సైల్ దాడి జ‌రిగింది. నాలుగు నుంచి ఆరు వ‌ర‌కు క్షిప‌ణులతో ర‌ష్యా  దాడి  చేసిన‌ట్లు గ‌వ‌ర్న‌ర్ మాక్సిమ్ కోజిస్కీ తెలిపారు. బ‌య‌ట‌కు ఎవ‌రూ రావ‌ద్దు అని, అంద‌రూ షెల్ట‌ర్ల‌లోనే ఉండాల‌ని సూచించారు. ప‌శ్చిమ లివివ్ ప్రాంతంలో అనేక పేలుడు శ‌బ్ధాలు వినిపించిన‌ట్లు చెప్పారు.

లివివ్‌ మేయర్ ఆండ్రీ సడోవి సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఫేస్‌బుక్‌లో ఐదు క్షిపణులు నగరంపై దాడి చేశాయనీ, పేలుళ్లకు అత్యవసర సేవలు స్పందిస్తున్నాయని చెప్పారు. ఉక్రెయిన్‌లోని లివివ్‌,  డ్నిప్రో ప్రాంతాల్లో పలు పేలుళ్లు సంభవించినట్లు అధికారులు నివేదించారు. పోలాండ్ బోర్డ‌ర్ స‌మీపంలో లివివ్ ప‌ట్ట‌ణం ఉంది. ప‌శ్చిమ లివివ్‌లో నాలుగు నుంచి ఆరు భారీ పెలుడు శబ్ధాలు వినిపించాయ‌ని స్థానికులు చెబుతున్నారు. దాడి జ‌రిగిన ప్రాంతాల నుంచి న‌ల్ల‌టి ద‌ట్ట‌మైన పొగు క‌మ్ముకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. దాదాపు రెండు నెలల రక్తపాత పోరాటాల తర్వాత రష్యా బలగాలు వ్యూహాత్మక దక్షిణ ఓడరేవు నగరం మారియుపోల్‌పై పూర్తి నియంత్రణకు చేరుకున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. సోమవారం పశ్చిమ మరియు దక్షిణ ఉక్రెయిన్‌లో పలు పేలుళ్లు జ‌రిగిన‌ట్టు తెలిపాయి. డాన్‌బాస్, రాజధాని కైవ్‌తో సహా ఇతర ప్రాంతాల్లో మిస్సైళ్ల దాడులు జరిగాయ‌ని వెల్ల‌డించాయి. 

ర‌ష్యా న‌ర‌మేధానికి పాల్ప‌డుతోంద‌ని ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు.  తాము లొంగిపోవ‌డం లేద‌ని పేర్కొన్నారు. తూర్పున పూర్తిగా రష్యా దాడిని ఎదుర్కొన్న ఉక్రెయిన్ వ్యూహాత్మకంగా కీలకమైన మారియుపోల్‌లో ఖచ్చితంగా చివరి వరకు పోరాడతామ‌ని ప్రతిజ్ఞ చేశారు. ఇక్కడ ధ్వంసమైన ఓడరేవు నగరంలో  పాకెట్ సొరంగాలతో కూడిన విశాలమైన స్టీల్ ప్లాంట్‌లో ఉంది. క్షిపణులు మరియు రాకెట్లు దేశంలోని ఇతర ప్రాంతాలను కూడా దెబ్బతీస్తున్నందున, ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ రష్యా సైనికులు తమ నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో చిత్రహింసలు మరియు కిడ్నాప్‌లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఏడు వారాల ముట్టడిలో శిథిలావస్థకు చేరిన మారియుపోల్ పతనం మాస్కోకు యుద్ధంలో అతిపెద్ద విజయాన్ని అందిస్తుంది. కానీ కొన్ని వేల మంది ఉక్రెయిన్ యోధులు ఉన్న అతిపెద్ద సొరంగ‌ అజోవ్‌స్టాల్ స్టీల్ ప్లాంట్.. ర‌ష్యాకు చుక్క‌లు చూపించే అకాశముంది. ఈ క్ర‌మంలోనే ఉక్రెయిన్ బ‌ల‌గాలు "మేము ఈ యుద్ధంలో చివరి వరకు, విజయం వరకు ఖచ్చితంగా పోరాడుతాము" అని ఉక్రేనియన్ ప్రధాన మంత్రి డెనిస్ ష్మిహాల్ వెల్ల‌డించారు. వీలైతే దౌత్యం ద్వారా యుద్ధాన్ని ముగించేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉంది కానీ.. లొంగిపోయే ఉద్దేశం త‌మ‌కు లేద‌ని స్ప‌ష్టం చేశారు. 

పిల్లలతో సహా చాలా మంది మారియుపోల్ పౌరులు కూడా అజోవ్‌స్టాల్ ప్లాంట్‌లో ఆశ్రయం పొందుతున్నారని నగరంలోని పెట్రోలింగ్ పోలీసు అధిపతి మిఖాయిల్ వెర్షినిన్ మారియుపోల్ న్యూస్ ఛానెల్ తో అన్నారు. రాజధాని కైవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలమైనందున.. ర‌ష్యా మద్దతుగల వేర్పాటువాదులు ఇప్పటికే కొంత భూభాగాన్ని ఆధీనంలో ఉంచుకున్న డాన్‌బాస్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా ముందుకు క‌దులుతున్న‌ట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. దేశ పౌరుల ర‌క్ష‌ణ కోసం తాము అన్ని ర‌కాల చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మవుతున్నామ‌ని ఉక్రెయిన్ అధ్య‌క్షుడు  జెలెన్స్కీ వెల్ల‌డించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే